జ‌గ‌న్ స‌మక్షంలో వైసీపీలో చేరిన చొక్కాకుల‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-10 17:52:24

జ‌గ‌న్ స‌మక్షంలో వైసీపీలో చేరిన చొక్కాకుల‌

ఏపీ ప్ర‌తిపక్షనేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రకు ప్ర‌జలు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ బ్రహ్మ‌ర‌థాన్ని చూసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని గ్ర‌హించి టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు అవ‌కాశం దొరికితే చాలు పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రేడి అవుతున్నారు. అయితే ఇప్ప‌టికే టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి అనుచ‌రుడు, అలాగే రాజ‌కీయ సీనియ‌ర్ నాయ‌కుడు య‌ల‌మంచిలి ర‌వి కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు.
 
ఇదే క్ర‌మంలో జిల్లాలోని ప‌లువురు నేత‌లు జ‌గ‌న్ మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టీడీపీ నాయ‌కుడు చొక్కాకుల వెంకట రావు క‌లుసుకుని  వైసీపీ తీర్థం తీసుకున్నారు ఆయ‌న‌తో పాటు విశాఖ నియోజ‌క వ‌ర్గానిక చెందిని టీడీపీ నాయ‌కులు కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు.
 
ఆ త‌ర్వాత వారు మీడియాతో మ‌ట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవ‌లం ఆ పార్టీ నాయ‌కుల‌కు మాత్ర‌మే ఫ‌లితాలు ద‌క్కుతున్నాయ‌ని వారు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎప్ప‌టినుంచో టీడీపీని న‌మ్ముకుని ఉన్న వారికి మ‌ర్యాద ఇవ్వ‌కుండా కొత్త‌గా వ‌చ్చిన వారికి మ‌ర్యాద ఇస్తున్నార‌ని అందుకే తాను వైసీపీలో చేరాన‌ని చొక్కాకుల వెంకటరావు స్ప‌ష్టం చేశారు. 2019లో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిని చేసేందుకు త‌న వంతు కృషి చేస్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.