వైసీపీలోకి టాప్ నిర్మాత

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-10 12:05:31

వైసీపీలోకి టాప్ నిర్మాత

మ‌రో సంవ‌త్స‌రం మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంది.. ఈ స‌మ‌యంలో రాజ‌కీయాలు అంటే అభిమానం, స‌మాజ సేవ, ప్ర‌జా శ్రేయ‌స్సు పై ఆకాంక్ష ఉన్న‌వారు, రాజ‌కీయ అభిలాష పరులు రాజ‌కీయ‌ పార్టీల్లో చేరి రాజ‌కీయంగా ఎద‌గాలి అని అనుకుంటున్నారు.అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంద‌రు వైసీపీలో చేరేందుకు ఇటీవ‌ల ఆస‌క్తి చూపుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఇప్ప‌టికే 24 క్రాఫ్ట్ నుంచి చాలా మంది ఉన్నారు. అయితే వైసీపీకి సినీ గ్లామ‌ర్ త‌క్కువ ఇక తాజాగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ లోటు కూడా వైసీపీకి తీరేలా క‌నిపిస్తోంది.
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి ఓ సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద వ్య‌క్తి రెడీ అవుతున్నారు అని తెలుస్తోంది.. కృష్ణాజిల్లాలో కైక‌లూరు సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలి అని ఓ పెద్ద నిర్మాత భావిస్తున్నారు. మైత్రీ మూవీస్ అధినేత నిర్మాత నవీన్ వైసీపీలో చేరి కైక‌లూరు నుంచి పోటీ చేయాలి అని కోరుకుంటున్నార‌ట‌. అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ బీజేపీ తెలుగుదేశం మైత్రి బంధంతో బాబుకు స‌న్నిహితంగా ఉండే బీజేపీ నాయ‌కుడు కామినేని శ్రీనివాస్ కు వెంక‌య్య సిఫార్సుతో ఎమ్మెల్యేగా సీటు ఇచ్చారు..ఆ త‌ర్వాత మంత్రి కూడా అయ్యారు వైద్య ఆరోగ్య శాఖ‌కు.
 
ఇక్క‌డ ఆయ‌న‌కు తెలుగుదేశం త‌ర‌పున అభ్య‌ర్ది ఎవ‌రు నిల‌బ‌డ‌లేదు గ‌త ఎన్నిక‌ల్లో.. అలాగే  వైసీపీ త‌ర‌పున రాంప్ర‌సాద్ ఉప్పాల పోటీ చేశారు. అయితే ఇప్పుడు ఇక్క‌డ జిల్లాలో ప‌లు సీట్లకు జగ‌న్ అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టించ‌లేదు. ఇటు మైత్రీ అధినేత న‌వీన్ తో పాటు డి. నాగేశ్వర్ రావు కూడా ఇక్క‌డ సీటు ఆశిస్తున్నారు అని తెలుస్తోంది.
 
ఇక 16 సెగ్మెంట్ల‌లో 8 సెగ్మెంట్ల‌లో జ‌గ‌న్ అభ్య‌ర్దుల‌ను ఫైన‌ల్ చేశారు.. ఇటు కైక‌లూరు సీటు  కూడా ఫిక్స్ చేయాలి. ఇటు పాద‌యాత్ర కూడా ఈ సెగ్మెంట్లో జ‌రుగుతోంది.. ఈ ప్రాంతంలో ఇక హిట్ల మీద హిట్లు కొడుతున్న మైత్రీ అధినేత సీటు సాధించుకుంటారా, డి. నాగేశ్వర్ రావు సాధిస్తారా  అనేది ఇప్పుడు ఇక్క‌డ చ‌ర్చించుకుంటున్న అంశం. చూడాలి కైక‌లూరులో వైసీపీ సీటు ఎవ‌రికో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.