జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో చోటాకే నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-09 16:10:52

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో చోటాకే నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ, అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు పాటిస్తున్న రెండు నాలుక‌ల ధోర‌ణిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్. ఈ సంక‌ల్పయాత్ర‌లో వైసీపీ అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌లకు వివ‌రిస్తూనే మ‌రో ప‌దినెల‌లు ఓపిక ప‌ట్టండి ఆ త‌ర్వాత మ‌నంద‌రి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే ప్ర‌తీ పేద‌వాడిలో చిరున‌వ్వును తెప్పిస్తాన‌ని కొండంత భ‌రోసా ఇస్తున్నారు జ‌గ‌న్.
 
ఇక ఆయ‌న ప్ర‌సంగాన్ని విన్న ప్ర‌జ‌లు వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే గ‌తంలో త‌న తండ్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి రాష్ట్రంలో ఏ విధంగా ప‌రిపాల‌న చేశారో అదే విధంగా 2019లో వైసీపీ  అధికారంలోకి వ‌స్తే ఖ‌చ్చితంగా మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తార‌ని ప్ర‌జల గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఇక మ‌రికొంద‌రు అయితే బ‌హిరంగానే తాము గ‌తంలో టీడీపీకి ఓటు వేసి త‌ప్పు చేశామ‌ని ఆ త‌ప్పును 2019లో స‌రిచేసుకుంటామ‌ని చెబుతున్నారు.
 
ఇక జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు, టీడీపీ కార్య‌క‌ర్త‌లే కాకుండా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మకు చెందిన న‌టిన‌టులు కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అయితే ఇప్ప‌టికే డైరెక్ట‌ర్, ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి, అలాగే 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ విడివిడిగా పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లుకుని ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కె నాయుడు మండపేట నియోజకవర్గం సోమేశ్వరంలో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ ను క‌లుసుకుని ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపి ఆయ‌న తోపాటు మూడు కిలోమీట‌ర్ల వ‌ర‌కు పాద‌యాత్ర చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తాను జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చూస్తుంటే ఒక రియ‌ల్ హీరోను చూసినట్లు ఉంద‌ని  అన్నారు. ఒక ముఖ్య‌మంత్రి కావ‌లిసిన మ‌నిషి ఎలా ఉండాలో తాను మొదటి సారిగా చూశాన‌ని స్ప‌ష్టం చేశారు. 2019 లో ఆయ‌న అధికారంలోకి వ‌స్తే ఖ‌చ్చితంగా మ‌ళ్లీ వైఎస్సార్ పాల‌న తీసుకువ‌స్తార‌ని తెలిపారు. జ‌గ‌న్ తో క‌లిసిన తర్వాత ఆయ‌న కోసం ఏమైనా చేయ‌డానికి తాను సిద్దంగా ఉన్నాన‌ని, ఆయ‌న‌ ఆరోగ్యంగా పాద‌యాత్ర చేయాల‌ని కోరుకుంటున్నాన‌ని చోటా కె నాయుడు స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.