కీల‌క మంత‌నాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-09 17:13:00

కీల‌క మంత‌నాలు

ఎఫ్ ఐ ఆర్ లేదు, చార్జ్ షీట్ల‌కు సంబంధం లేదు, ఆ వాయిస్ మాది కాదు.. మ‌న వాళ్లు బ్రీఫ్డ్ మీ అనే మాట బాబుది కాదు అని అంటున్నారు నాయ‌కులు.. అయితే ఓటుకు నోటు  ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వ‌చ్చిన నివేదిక ఆధారంగా సీఎం కేసీఆర్ అధికారులు, న్యాయ‌వాదుల‌తో కీల‌క మంత‌నాలు జ‌రిపారు.  దీంతో తెలుగుదేశం నాయ‌కుల‌కు ఇక్క‌డ సెగ త‌గిలింది. ఓ అడుగు మందుకు వేసి మంత్రి సోమిరెడ్డి కూడా ఈ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
 
చంద్రబాబుపై ఎలాంటి కేసు లేదని, గతంలో హైకోర్టు కూడా ఈ విషయం స్పష్టం చేసిందని ఆయన అన్నారు. ఓటుకు కోట్లు కేసుపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్ష చేసినంతమాత్రాన ఏమీ కాదని అన్నారు. ఓటుకు కోట్లు కేసుపై తమకెలాంటి భయం లేదని చెప్పారు. మత్తయ్య పిటిషన్‌ సమయంలో దీనిపై క్లారిటీ ఇచ్చిందని తెలిపారు.
 
అస‌లు కేసీఆర్ కోర్టు కేసులపై మంత‌నాలు జ‌ర‌ప‌డం ఏమిటి అని అంటున్నారు తెలుగుదేశం నాయ‌కులు.. ఇక తెలుగుదేశం నాయ‌కులు అప్పుడే రెడీ అయిపోతున్నారు, బాబు పై ఏదో జ‌రుగ‌బోతోంది అని.టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ విష‌యం పై   మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు అని తెలుస్తోంది. ఈ సమావేశానికి సీనియర్‌ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, అయన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజరయ్యారు.
 
ఓటుకు కోట్లు కేసులో మళ్లీ కదలిక రావడం, ఈ కేసును ఓ కొలిక్కి తెచ్చేదిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో కీలక సమావేశం నిర్వహించిన నేపథ్యంలో చంద్రబాబు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నోటుకు కోట్లు కేసు విషయంలో రాజకీయంగా ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఈ సమావేశంలో మంత్రులతో చంద్రబాబు చర్చించినట్టు తెలుస్తోంది.
 
ఇక ఇప్ప‌టికే పోరాట దీక్షల్లో చంద్ర‌బాబు ఇదే మారిదిగా తెలియ‌చేశారు. త‌న పై కేంద్రం కుట్ర‌ప‌న్నుతోంద‌ని త‌న‌కి ర‌క్ష‌ణ వ‌ల‌యంగా ఉండాలి అని ఆయ‌న ప్ర‌జ‌ల‌ని కోరారు. మొత్తానికి ఇరు వైపులా అధికారులు, నాయ‌కుల‌తో కీల‌క మంత‌నాలు జ‌రుగుతున్నాయ‌ని క‌ర్నాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత దీనిపై ఓ తుది క్లారిటీ వ‌స్తుంది అని అంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.