సీఎం ర‌మేష్ కు ఆదినారాయ‌ణ రెడ్డికి ప‌రాభ‌వం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-15 16:58:51

సీఎం ర‌మేష్ కు ఆదినారాయ‌ణ రెడ్డికి ప‌రాభ‌వం

వైసీపీ అధినేత జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో క‌డ‌ప‌జిల్లా తెలుగుదేశం నాయ‌కుల రూటే వేరు.. ముఖ్యంగా మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి వైసీపీ అధినేత‌పై విమ‌ర్శ‌లు చేయ‌డంలో ఈ నాలుగేళ్లుగా క‌డ‌ప‌లో ఆయ‌నే ముందు వ‌రుస‌లో ఉన్నారు. ఇక తాజాగా ఆయ‌న దారుణ‌మైన పరాభ‌వం ఎదురైంది.
 
జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం ఎంపీ సీఎం రమేష్ అమరణ దీక్షపై శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఇందుకోసం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. ఈ క్రమంలో సమావేశానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్, టీడీపీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు.
 
ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉన్నా ఈ స‌మావేశానికి టీడీపీ నేత‌లు ప్రజాసంఘాల‌కు సంబంధించి ఇద్దరు ముగ్గురు మిన‌హా ఎవ‌రూ హాజ‌రుకాలేదు.. ఇక ప్ర‌జా విద్యార్ది  సంఘాల నేత‌లు కూడా హాజ‌రుకాలేదు.. నాలుగేళ్లుగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం పోరాడని టీడీపీ ఈరోజు సమావేశం పెడితే ఎలా అంటూ వామపక్షాలు కార్యక్రమాన్ని బహిష్కరించాయి.
 
బీజేపీతో సంసారం చేసి విడిపోయి జిల్లాకు మోసం చేశారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.. ముఖ్యంగా ఈ స‌మావేశానికి తెలుగుదేశం నేత‌లు ఇటువంటి ప‌రిస్దితి ఎదుర్కోవ‌డంతో అక్క‌డ ఉన్నాకేడ‌ర్ కూడా కంగుతిన్నారు.
 
తెలుగుదేశం స‌ర్కారు ఎటువంటి మాటలు చెప్ప‌లేద‌ని ఈ నాలుగేళ్ల కాల‌యాప‌న చేసిన తెలుగుదేశం, ఇప్పుడు కొత్త‌గా ఉక్కు ప‌రిశ్ర‌మ పై మాట్లాడం పై ఇక్క‌డ నేత‌లు కూడా మండిప‌డుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.