సీఎం ర‌మేష్ రాజీనామా ఇదే రీజ‌న్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

CM Ramesh image
Updated:  2018-03-28 01:10:53

సీఎం ర‌మేష్ రాజీనామా ఇదే రీజ‌న్ ?

రాజ్య‌స‌భ‌లో రెండో సారి అవ‌కాశం సాధించుకున్నారు ఎంపీ సీఎం ర‌మేష్.... చంద్ర‌బాబుకు శిష్యుడుగా బాబుకు న‌మ్మిన బంటుగా ఉంటూ రెండోసారి అవ‌కాశం కోసం ప్ర‌యత్నించి అనేక పేర్లు వినిపించినా చివ‌ర‌కు సీఎం ర‌మేష్ త‌న అభ్య‌ర్దిత్వాన్ని సాధించుకుని రెండోసారి రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు..  అయితే నేడు రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రాజ్య‌స‌భ నుంచి రిటైర్ అవుతున్న ఎంపీల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. వారి భ‌విష్య‌త్తు బాగోవాలి అని ఆయ‌న ఆశించారు..
 
ప్రతి ఎంపీ కూడా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారన్నారు. ప్రతి ఒక్కరు దేశ భవిష్యత్తు కోసం తమవంతు సహకారం అందించారన్నారు మోదీ.. ఇక స‌భ‌లో అప్ప‌టి వ‌రకూ అంద‌రూ నినాదాలు చేస్తూ ఉన్న దృశ్యం క‌నుమ‌రుగైంది... ప్ర‌ధాని మాట్లాడిన స‌మ‌యంలో మొత్తం స‌భ కామ్ అయింది.
 
ఇక తెలుగుదేశానికి చెందిన ఎంపీ సీఎం ర‌మేష్ తెలంగాణ త‌ర‌పున గ‌తంలో రాస్య‌స‌భ‌కు వెళ్లారు... అయితే ఇక ఆ ప‌ద‌వీకాలం గ‌డువు ముగియ‌డంతో.. సీఎం ర‌మేష్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు.. ఇక ఏపీ నుంచి తాజాగా ఎన్నిక అవ్వ‌డంతో ఆయ‌న రాజీనామా చేశారు అని తెలుస్తోంది.
 
ఒకే సమయంలో అటు తెలంగాణ, ఇటు ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడానికి వీల్లేదు కాబట్టి ఆయన రాజీనామా చేశారు. వాస్తవంగా ఏప్రిల్ 2 వరకు సీఎం రమేష్ పదవీ కాలం ఉంది. కానీ ఏపీ నుంచి ఎన్నికైనందున ఆయన తెలంగాణ పేరిట కొనసాగరాదని నిర్ణయించుకున్నారు. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించారని తెలుస్తోంది.ఇటు వైపు ఎంపీ విజయ‌సాయిరెడ్డి ప్ర‌ధాని కాళ్లు ప‌ట్టుకోలేదు అని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తా అని కూడా తెలియ‌చేశారు మొత్తానికి తెలుగుదేశం వైసీపీ నాయ‌కుల వార్ హ‌స్తిన‌లో మార్మోగిపోతోంది.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.