2019లో పోటీ...?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 03:40:02

2019లో పోటీ...?

ప్ర‌ముఖ తెలుగు హాస్య న‌టుడు పృధ్వి రాజ్ పై గ‌త కొంత కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. పృధ్వి ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ప్ర‌తిసారి దివంగ‌త నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాల‌న‌ను గుర్తు  చేయ‌డంతో పాటు... వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తూనే ఉన్నారు. 
 
ఈ క్ర‌మంలో  పృధ్వి వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేస్తార‌నే వార్త  ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది. ఇటీవ‌ల జ‌రిగిన ఓ సంఘ‌ట‌న  చూస్తే అది నిజ‌మే అనిపించ‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. తాజాగా క‌మెడియ‌న్ పృధ్వి, గుంటూరు ఈస్ట్ వైకాపా ఎమ్మెల్యే ముస్త‌ఫా క‌లిసి ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 
 
ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ముస్త‌ఫా మీడియాతో మాట్లాడుతూ.... పృధ్విలాంటి మంచి మ‌నిషి  పార్టీలోనే  ఉండాల‌ని, ప్ర‌జా స‌మస్య‌ల‌పై మాట్లాడేందుకు అసెంబ్లీలో అడుగుపెట్టాల‌ని కోరడం ఇప్పుడు చర్చ‌నీయాంశంగా మారింది. త‌న‌కు దివంగత నేత వైయ‌స్సార్ అంటే అభిమాన‌మ‌ని వైసీపీలో కొన‌సాగుతాన‌ని  పృధ్వి అన్నారు. 
 
వీరిద్ద‌రి  వ్యాఖ్య‌ల‌ను గ‌మ‌నిస్తే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో పృధ్వి వైసీపీ నుండి 2019 ఎన్నిక‌ల్లో నిజంగానే పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రోవైపు  ప్ర‌ముఖ తెలుగు ద‌ర్శ‌కుడు వి.వి వినాయ‌క్ కూడా వైకాపాకు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డ‌మే కాకుండా పోటీ చేసేందుకు కూడా ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత వ‌ర‌కు సాధ్య‌ప‌డుతోందో వేచి చూడాలి. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.