పృథ్వీకి వైసీపీ త‌ర‌పున ఆ సీటు ఫిక్స్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys jagan and prudhvi raj
Updated:  2018-06-20 04:28:26

పృథ్వీకి వైసీపీ త‌ర‌పున ఆ సీటు ఫిక్స్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయ నాయ‌కులు రోజుకొక రంగు పూసుకుని వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒకవైపు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చి చ‌రిత్ర సృష్టించాల‌నే ఉద్దేశంతో మినీ మ‌హానాడు స‌భ‌ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.ఈ స‌భ‌లో టీడీపీ అధికాంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అయిన క్ర‌మంలో త‌మ ప‌రిపాల‌న‌పై ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తెలుకున్నారు.
 
ఇక మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి రాక‌పోతే రాజ‌కీయ మ‌నుగ‌డ ఉండ‌ద‌నే ఉద్దేశంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌ను త‌ల‌పెట్టారు. ఈ సంక‌ల్ప‌యాత్ర‌ ఇప్ప‌టికే రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌ను, అలాగే కోస్తాలోని ఐదు జిల్లాల‌ను పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతోంది. ఈ సంక‌ల్ప‌యాత్ర‌కు ప్ర‌జల మ‌ద్ద‌తే కాకుండా తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టులు కూడా జ‌గ‌న్ కు అధిక సంఖ్య‌లో మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. జ‌గ‌న్ కోర‌కుండానే ఇప్ప‌టికే టాలీవుడ్ నుంచి హీరో సూప‌ర్ స్టార్ కృష్టా, మంచు విష్ణు, హాస్య‌న‌టులు, పోసాని కృష్ణ‌ముర‌ళీ, 30ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీలు వైఎస్ జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇచ్చారు.
 
ఇలా జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో వైసీపీకి కాస్త జోష్ ను ఇచ్చిన‌ట్లు అయింది. ఇక ఈ క్ర‌మంలో ఇద్ద‌రి పేర్లు టికెట్ల రేసులో ఉన్నాయ‌ని  వార్త‌లు వ‌స్తున్నాయి. వారిలో ప్ర‌ధానంగా పోసాని కృష్ణ మురళీ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున గుంటూరు జిల్లా చిలుకూరిపేట నుంచి పోటీ చేస్తార‌ని వార్తలు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై పోసాని గ‌తంలో స్పందించారు. తాను వైసీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేయ‌న‌ని త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని స్ప‌ష్టం చేశారు.
 
ఇక ఇదే క్ర‌మంలో 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ పై కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఈయ‌న కూడా కొద్దిరోజుల క్రితం ప‌శ్చిమ‌ గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లుసుకుని ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ఆ త‌ర్వాత ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై వ్య‌తిరేకంగా వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్షను నెల్లూరు జిల్లాలో చేప‌డితే ఆ దీక్షకు పృథ్వీ పాల్గొని టీడీపీ ప‌రిపాల‌న‌పై ప‌లు వ్యాఖ్య‌లు చేసి అంద‌రిని షాక్ కు గురిచేశారు.
 
గతంలో పృథ్వీని వైసీపీలో చేరుతారా అని అడిగితే ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఖాళీగా లేన‌ని చెప్పారు. అయితే ఇప్పుడు ఆయ‌న పూర్తి స్థాయిలో వైసీపీ తీర్థం తీసుకుంటార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంతే కాదు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లి గూడెంలో వైసీపీ త‌ర‌పున టికెట్ క‌న్ఫామ్ అయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నియోజ‌కవ‌ర్గంలోప్ర‌స్తుతం బీజేపీ ఎమ్మెల్యే పైడికొండ‌ల మాణిక్యాల రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. 
 
2014 లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకోవ‌డంతో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థిని పోటీ చేయించారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి చెక్ పెట్టేందుకు పృథ్వీని రంగంలోకి దించాల‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త‌లు నిజం అయితే వైసీపీ మ‌రో రికార్డును సొంతం చేసుకుంటుంది. ఎందుకంటే గ‌డిచిన రాజ‌కీయ హిస్ట‌రీలో హాస్య‌న‌టుల‌కి ఎవ్వ‌రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వ‌లేదు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.