పాద‌యాత్రలో పృథ్యీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-29 16:50:37

పాద‌యాత్రలో పృథ్యీ

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మెహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర రాయ‌ల‌సీమలోని నాలుగు జిల్లాల‌ను అలాగే కోస్తాంధ్ర‌లోని ప్ర‌కాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావారి జిల్లా భీమ‌వ‌రం సివారులో నిర్విరామంగా కొనసాగుతోంది.
 
ఈ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ తాము అధికారంలో వ‌స్తే అమ‌లు చేయబోయే న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతున్నారు.
 
ఇక ఈ పాద‌యాత్ర‌లో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో పాటు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన కొంద‌రు ప్ర‌ముఖులు కూడా జ‌న‌నేత జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అయితే ఇప్ప‌టికే ప‌శ్చిమ గోదావారి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ద‌ర్శ‌కుడు, హాస్య‌న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి క‌లిసి ఆయ‌న‌తో పాటు సుమారు రెండు కిలోమీట్ల వ‌ర‌కూ పాద‌యాత్ర చేసిన సంగ‌తి తెలిసిందే.
 
ఇక తాజాగా ఇండ‌స్ట్రీకి చెందిన మ‌రో హ‌స్య న‌టుడు, కామెడీ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న 30 ఇయర్స్ ఇండ‌స్ట్రీ పృథ్యీ పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ ను క‌లిసి ఆయ‌న‌తో పాటు పాద‌యాత్ర చేశారు. ఈ పాద‌యాత్ర‌లో ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు.
 
ఆ త‌ర్వాత మీడియాతో పృథ్యీ మాట్లాడుతూ, జ‌గ‌న్ తో పాటు తాను న‌డిచిన కొన్ని నిమిషాల‌కే అల‌సిపోయాన‌ని కానీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2000 వేల కిలో మీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర ఎలా చేశారో దేవుడికే తెలుస‌ని అన్నారు. పాద‌యాత్ర చేసేట‌ప్ప‌డు జ‌గ‌న్ ఏదైతే చేయాల‌నుకున్నారో అదే చేస్తాన‌ని చెప్పార‌ని, అమ‌లు చేయ‌లేనివ‌న్ని ప్ర‌జ‌ల‌కు ప్ర‌క‌టించి అధికారంలోకి రావ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని అన్నార‌ని పృథ్యీ తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.