టీడీపీ ఎంపీ గే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-10 18:46:49

టీడీపీ ఎంపీ గే

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన రైల్వే జోన్, ప్ర‌త్యేక‌ హోదా, క‌డ‌ప ఉక్కుప‌రిశ్ర‌మ సాధ‌న‌కోసం అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ ప్ర‌తీ రోజు ఒక వేష‌ధార‌ణ రూపంలో త‌న నిర‌స‌న‌ను తెలుపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే క్ర‌మంలో నేడు శివ‌ప్ర‌సాద్ ఏకంగా ట్రాన్స్ జెండ‌ర్ వేషం వేసుకుని త‌న నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. ఇక ఆయ‌న వేషం చూసిన ఇత‌ర రాజ‌కీయ నాయ‌కులు న‌వ్వుకుంటుంటే... మ‌రికొంద‌రు అయితే పార్ల‌మెంట్ ప్ర‌తిష్ట‌త‌ను తెలుగుదేశం పార్టీ ఎంపీలు దిగ‌జార్చుతున్నార‌ని వారు వాపోతున్నారు.
 
అయినా స‌రే శివ‌ప్ర‌సాద్ మాత్రం త‌గ్గ‌డంలేదు... ప్ర‌ధాని మోడీ స్పందించే వ‌ర‌కూ తాను ప‌గ‌టి పూట వేషం వేస్తునే ఉంటాన‌ని స్పష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగిన‌ప్ప‌టినుంచి తాను కేంద్రానికి వ్య‌తిరేకంగా అనేక విధాలుగా, మ‌తాల‌వారిగా వేష‌ధార‌ణ‌తో పార్ల‌మెంట్ ప‌రిధిలో వేసి చూపించాన‌ని ఇక మిగిలింది ట్రాన్స్ జెండ‌ర్ వేష‌మే అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అందుకే తాను ఈ  వేషం వేసుకుని కేంద్ర ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకిస్తున్నాన‌ని శివ‌ప్ర‌సాద్ అన్నారు. 
 
అంతేకాదు కొత్త‌ గెట‌ప్ తో ఉన్న శివ ప్ర‌సాద్ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ప‌లుక‌రించారు. అనేక వేష ధార‌ణ‌ల‌తో కేంద్రానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు తెలుపుతున్న ఆయ‌న‌కు సోనియా సంఘీభావం ప్ర‌క‌టించి వారి మంచి చెడును అడిగిన‌ట్లు తెలుస్తోంది. కాగా రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో ఇద్ద‌రు బ‌ద్ద‌శ‌త్రువుల బంధానికి మ‌రింత బ‌లం చేకూర్చిన‌ట్లు అయింది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.