టీడీపీలో చేరిన వెంట‌నే షాక్ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-05 17:43:36

టీడీపీలో చేరిన వెంట‌నే షాక్ ?

వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి బీజేపీలో చేరి బీజేపీ న‌ర‌సాపురం సీటు ఇవ్వ‌క‌పోవ‌డం అలాగే ఏపీలో బీజేపీ ఏ ప‌దవి ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న తెలుగుదేశంలో చేరారు.... ఆయ‌నే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నేత ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త రఘురామకృష్ణంరాజు.. అయితే నిన్న‌టి నుంచి  తెలుగుదేశం నేత‌గా మారిపోయారు ఆయ‌న...
 
ఇక తెలుగుదేశంలోకి ఎవ‌రు వెళ్లినా చంద్ర‌బాబు అభివృద్ది చూసి ఆయ‌న చేస్తున్న సేవ‌ను చూసి పార్టీ మారి ఆయ‌నతో క‌లిసి ముందుకు వెళుతున్నాం అంటున్నారు, అదే మాట ఇటు రాజుగారు కూడా చెప్పారు ...అయితే ఇంకా సీఎం చంద్ర‌బాబును ఏకంగా స్వాతంత్ర స‌మ‌ర‌యోధుల‌తో పోల్చారు. ఇక చంద్ర‌బాబులాంటి నాయ‌కుడు ఏపీకి దొర‌క‌డం అదృష్టం అని అన్నారు ఆయ‌న, అయితే నిన్న‌టి వ‌ర‌కూ బీజేపీలో ఉండి ఇప్పుడు బాబు పార్టీలో చేరిన ర‌ఘురామ‌కృష్ణం రాజు పై వామ‌ప‌క్ష నేత‌లు ఫైర్ అవుతున్నారు.
 
కారల్‌ మార్క్స్‌ 200వ జయంతి సందర్భంగా వామపక్ష నేతలు విజయవాడలో నివాళులర్పించారు.సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణ కారల్‌ మార్క్స్‌ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రంలో మహిళలు, దళితులకు రక్షణ లేకుండా పోయిందని సీపీఎం కార్యదర్శి మధు మండిపడ్డారు.
 
ప్రతి రోజు రాష్ట్రంలో మహిళలపై ఏదో ఒకచోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా పరిస్థితులు మారడం లేదని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంత మంది శిక్షల నుంచి తప్పించుకుంటున్నారని మధు టీడీపీ నాయకులను ఉద్దేశించి అన్నారు. వామపక్ష పార్టీలతో కలసి అత్యాచారాలకు వ్యతిరేకంగా త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
 
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మట్లాడుతూ ప్రత్యేక హోదా అంశంపై చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 8న అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకున్న రఘురామకృష్ణంరాజు లాలూచీ రాయకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
 
స్వాతంత్య్ర సమరయోధులతో చంద్రబాబు నాయుడిని పోల్చినందుకు రఘురామకృష్ణంరాజు నాలుక చీరేస్తామని హెచ్చరించారు. స్వాతంత్య్ర యోధుల‌ కాలి గోటికి కూడా చంద్రబాబు సరిపోరనీ.. ఇలా అవాకులు చెవాకులు పేలుతూ స్వాతంత్య్ర‌ సమరయోధులను అవమానిస్తే ఊరుకునేది లేదని రామకృష్ణ అన్నారు... చేరిన మొద‌టి రోజే ఇలా చేసిన వ్యాఖ్య‌ల పై దుమారంరేగ‌డం పై నాయ‌కులు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.