వైసీపీలోకి ర‌ఘు వీరారెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

congress chief raghu veera reddy and ysr congress party
Updated:  2018-05-29 06:09:27

వైసీపీలోకి ర‌ఘు వీరారెడ్డి

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఒక వైపు అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌తిప‌క్ష‌నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చేస్తున్నారు. మ‌రో వైపు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మ‌రోసారి అధికారంలోకి రావాల‌నే సంక‌ల్పంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా మినీ మ‌హానాడు స‌భ‌లను నిర్వ‌హిస్తున్నారు.ఇక  రెండింటిలో ప్ర‌జ‌లు ఏ పార్టీకి అధిక సంఖ్య‌లో మ‌ద్ద‌తు తెలుపుతున్నారు అంటే అది కేవ‌లం ప్ర‌తిప‌క్ష వైసీపీకి మాత్ర‌మే. ఈ విష‌యం రాష్ట్రంలో రాజ‌కీయం పై ఏ మాత్రం అవ‌గాహ‌న లేని వ్య‌క్తిని అడిగినా కూడా ఇదే స‌మాధానం చెబుతారు.
 
జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న మ‌ద్ద‌తును చూసి అధికార తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పాద‌యాత్ర చేస్తున్న‌ జ‌గ‌న్ ను క‌లిసి ఆయ‌న‌ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకుంటున్నారు. ఇప్ప‌టికే టీడీపీకి  సీనియ‌ర్ నాయ‌కులుగా ఉన్న య‌ల‌మంచిలి ర‌వి, వసంత ఫ్యామిలీ కూడా వైసీపీ తీర్థం తీసుకున్నసంగ‌తి తెలిసిందే. ఇక ఇదే క్ర‌మంలో బ‌న‌గాన‌ప‌ల్లి టీడీపీ ఎమ్మెల్యే బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి కూడా త్వ‌ర‌లో వైసీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బీసీతో పాటు 2014లో ఆయ‌న‌ గెలుపుకు కార‌ణం అయిన చ‌ల్లా రామ‌కృష్ణా రెడ్డిని కూడా వైసీపీలోకి తీసుకువ‌చ్చేందుకు స‌న్న‌హాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది.
 
ఇక దీంతో పాటు చంద్ర‌బాబు నాయుడుకు ఇష్ట‌మైన జిల్లా అనంత‌పురం జిల్లాలో త‌న గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకునేందు ఒక కీల‌క స‌ర్వేను నిర్వ‌హించారు. చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు అనంత‌పురం ఎమ్మెల్యేల ప‌రిపాన‌ను ప‌రిగ‌ణ‌కి తీసుకుని స‌ర్వే నిర్వ‌హించారు. ఈ  స‌ర్వేలో చంద్ర‌బాబు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా రిజ‌ల్ట్స్ వ‌చ్చాయి. ఇప్ప‌టికిప్పు అనంత‌పురం జిల్లాలో ఎన్నిక‌లు జ‌రిగితే అత్య‌ధిక మెజార్టీ తో వైసీపీ గెలిచే అవ‌కాశం ఉంద‌ని ఈ సర్వే తెలిపింది.
 
ఇక ఈ మైండ్ సెట్ లో నుంచి చంద్ర‌బాబు బ‌య‌టికి రాకముందే మ‌రో గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్ రఘువీరారెడ్డి కూడా వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నార‌ట‌. 2019 లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక త‌న‌కు ఎలాంటి ప‌ద‌వులు అవ‌స‌రంలేద‌ని కేవ‌లం హిందూపురం నుంచి బాల‌య్య‌పై పోటీ చేయాల‌న్న ఆస‌క్తి మాత్ర‌మే ఉంద‌ట‌. అంత‌కు మించి త‌న‌కు ఎలాంటి ప‌ద‌వులు అవ‌స‌రం లేద‌ని చెప్పారట‌. అయితే ఈ మేర‌కు రఘువీరా వ్యక్తిగత సర్వేలు కూడా చేయించుకున్నాడట. ఈ స‌ర్వే అనంత‌రం విజయసాయిరెడ్డితో భేటీ అయ్యార‌ట‌. తాను క‌చ్చితంగా పోటీ చేస్తే బాలయ్యపై గెలుస్తానని లెక్కలతో సహా విజయసాయికి వివరించార‌ట రఘువీరా. ఇక జగన్ ఓకే కోసం ఎదురుచూస్తున్నారు రఘువీరా. 
 
ఆయ‌న కాని వైసీపీలోకి చేరితే క‌చ్చితంగా టీడీపీ కంచుకోట బ‌ద్ద‌లు అయ్యే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంది. ఎందుకంటే గ‌తంలో కూడా దివంగ‌త నేత‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, ర‌ఘువీరా రెడ్డి క‌లిసి అనంత‌పురం జిల్లాలో తిష్ట‌వేసి చంద్ర‌బాబు నాయుడు గ్రాఫ్ మొత్తం దించారు. ఇక ఇదే ప‌రిస్థితి 2019 ఎన్నికల‌ ప్ర‌చారంలో జ‌రుగుతుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.దీంతో చంద్ర‌బాబునాయుడు ఈ విష‌యంపై తీవ్రంగా ఆలోచిస్తున్నార‌ట‌.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.