కాంగ్రెస్-టీడీపీ పొత్తు ఓకే.. కాస్కో కేసీఆర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

kcr and tdp congress
Updated:  2018-09-07 05:07:24

కాంగ్రెస్-టీడీపీ పొత్తు ఓకే.. కాస్కో కేసీఆర్

తెలుగుదేశం పార్టీతో క‌ల‌సి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని టీ-పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కూమార్ రెడ్డి స్ఫ‌ష్టం చేశారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ను ఓడించేందుకు టీడీపీ స‌హా అన్ని పార్టీలు క‌లిసి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. 
 
రేపు ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్ రానున్న నేప‌థ్యంలో ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని కాంగ్రెస్ నేత‌లు తెలుపుతున్నారు. ఇక మ‌రో వైపు పొత్తుల‌ను ఖ‌రారు చేసేందుకు ఒక క‌మిటీని ఏర్పాటు చేశారు. ఇక ఈ క‌మిటీ ముగిసిన త‌ర్వాత మిగిలింది కేవ‌లం సీట్ల పంప‌కం మాత్ర‌మే మిగిలిన‌ట్లు క‌నిపిస్తోంది.

షేర్ :

Comments