కాంగ్రెస్‌ కోవర్టే పక్కా ఆధారాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

sumuveraraju
Updated:  2018-04-01 04:24:42

కాంగ్రెస్‌ కోవర్టే పక్కా ఆధారాలు

ఏపీకి అన్యాయం చేసిన ప్ర‌ధాని మోదీ పై  తిర‌గ‌బ‌డాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్ర‌జ‌లకు సూచించిన విష‌యం తెలిసిందే.  దీనికి స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చంద్ర‌బాబు డిప్రెషన్‌లో ఉండ‌డం వ‌ల్ల‌ తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తున్నార‌ని అందుకే ప్ర‌ధాని మోదీ పై తిరగుబాటు చేయాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నార‌ని తెలిపారు.
 
క‌డ‌ప జిల్లా పులివెందులలో  మీడియాతో మాట్లాడిన సోమువీర్రాజు టీడీపీ ఎన్నిక‌ల సంద‌ర్బంగా 1200 హ‌మీలు ఇచ్చింద‌ని అన్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కనీసం వాటిలో 10శాతం కూడా పూర్తి చేయలేద‌ని ఆయ‌న తెలిపారు. బీజేపీ ఎన్నిక‌ల్లో స‌మ‌యంలో ప్ర‌క‌టించిన హ‌మీల‌లో 50శాతం పూర్తి చేసింద‌ని అన్నారు.మిగిలిన హ‌మీల‌ను త్వ‌ర‌లోనే అమ‌లు చేస్తామ‌ని సోమువీర్రాజు తెలిపారు. అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను వ‌దిలి స్వ‌ప్ర‌యోజ‌నాల్లో బిజీ అయ్యార‌ని  విమ‌ర్శించారు.
 
స్కూల్‌ యూనిఫామ్‌ క్లాత్‌లను చెన్నై నుంచి తెచ్చి అప్కోలో కొన్నట్లు చెబుతూ బ‌డి పిల్ల‌ల‌ను సైతం మోసం చేస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. చంద్రబాబు రాజ‌కీయ జీవితం మొత్తం లాలూచీతో కూడుకున్న‌దే అని అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకున్న‌ది నిజంకాదా అని అడిగారు. ప్ర‌స్తుతం మోదీని ఒడించ‌డానికి కాంగ్రెస్‌తో చీక‌టి ఒప్పందం చేసుకున్నార‌ని చంద్ర‌బాబు పై  సోమువీర్రాజు విరుచుకుపడ్డారు. 
 
రాయలసీమ జిల్లాలకు కేంద్రం చేసిన సాయం గురించి వివరించిన ఆయ‌న‌ పెండింగ్‌లో ఉన్న నీటిపారుద‌ల ప్రాజెక్ట్‌ పనులను త్వరలో పూర్తి చేస్తామ‌ని తెలిపారు. బీజేపీ రాయలసీమపై కన్నబిడ్డ  ప్రేమను చూపిస్తుంటే బాబు మాత్రం సవతి ప్రేమ చూపిస్తున్నారంటూ విమర్శించారు. హంద్రినీవా ప్రాజెక్ట్‌  అంచనాలను పెంచి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ ను అద్భుతంగా తీర్చి దిద్దినట్లు అసెంబ్లీలో ప్రకటించారని.. మళ్లీ ఇప్పుడు అదే అసెంబ్లీలో నిత్యం అబద్ధాలు చెబుతున్నారని సోమువీర్రాజు మండిపడ్డారు. సీఎం డ్యాష్ బోర్డ్ అనేది మొత్తం ఒక బూట‌క‌మ‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.