బాబుకు ముడుపులు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 12:40:08

బాబుకు ముడుపులు

ఎక్క‌డ అభివృద్ది గంగ‌లా ప‌రుగులు తీస్తుందో అక్క‌డ అవినీతి తాండ‌వం చేస్తుంది అంటారు రాజ‌కీయాల్లో కొంద‌రు... స‌రే ప్ర‌జ‌ల‌కి కావ‌ల‌సింది అభివృద్ది ప‌నులు ప‌థ‌కాలు  కావున ఆ తాండ‌వ‌లు అవినీతి మ‌ర‌క‌లు ప్ర‌జ‌లు ప‌ట్టించుకోరు, మాకు కావ‌ల‌సిన అవ‌స‌రాలు మెరుగైన స‌దుపాయాలు క‌లిగించారా లేదా అనేది స్దానిక నాయ‌కుల‌ను బ‌ట్టి తీర్చుకుంటారు ప్ర‌జ‌లు.
 
అయితే ఇప్పుడు ఏపీని  అభివృద్దిలో జ‌పాన్ రైలులా ముందుకు తీసుకువెళ‌తాం అంటున్నారు చంద్ర‌బాబు... కాని మ‌చిలీప‌ట్నం భీమ‌వ‌రం ప్యాసింజ‌ర్ లా అభివృద్ది ముందుకు వెళుతోంది...అయితే నిధులు మాత్రం ఖ‌ర్చు అవుతున్నాయి.. అంద‌రూ వారే అయితే....... బుట్ట‌లో చేప‌లు ఏమ‌య్యాయి అని సామెతలా, ఏపీకి కేంద్రం వేల కోట్ల రూపాయ‌ల నిధులు ఇచ్చినా, ఎటువంటి పురోగ‌తి ఏపీ అభివృద్దిలో కనిపించ‌డం లేదు. దీంతో కేంద్రం కూడా సైలెంట్ అయింది.. ఏపీకి నిధుల విడుద‌ల‌లో వివ‌క్ష చూపుతోంది అని తాజా బ‌డ్జెట్ కేటాయింపుల్లో స్ప‌ష్టం అయింది.
 
ఇక పోల‌వ‌రం అంటే తెలుగుదేశం అధినేత సీఎం చంద్ర‌బాబు  సోమ‌వారం పోల‌వ‌రం అంటారు.. అయితే ఇప్పుడు బీజేపీ ప్ర‌తీ రోజూ పోల‌వ‌రం అంటోంది... పోల‌వ‌రం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ పార్టీ ఓ కామెంట్ చేసింది.. అలాగే సీఎం చంద్ర‌బాబు పై ఆరోప‌ణ‌లు చేసింది.
 
పోల‌వ‌రం ప్రాజెక్ట్ విష‌యంలో చంద్ర‌బాబుకు ముడుపులు అందాయ‌ని, ఆ ముడుపులు విదేశాల్లో చంద్ర‌బాబు తీసుకున్నారు అని కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర‌మంత్రి జైరామ్ ర‌మేష్ ఆరోప‌ణ‌లు చేశారు.. అయితే నోటికి వ‌చ్చిన ఆరోప‌ణ‌లు తాము చేయ‌డం లేద‌ని? ఆ ముడుపుల‌కు సంబంధించి ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయి అని అన్నారాయ‌న‌..ఈ విష‌యంలో చంద్ర‌బాబు బండారం బ‌య‌ట‌పెడ‌తామ‌ని అన్నారు.
 
పోల‌వ‌రం కేంద్రం నిర్మించాలి కాని, రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున చంద్ర‌బాబు నిర్మిస్తాన‌ని అందుకే ముందుకు వ‌చ్చారు అని తెలిపారు జైరామ్ రమేష్ ... ఏపీ విభ‌జ‌న హామీల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, సీఎం చంద్ర‌బాబు ఇద్ద‌రూ డ్రామాలు ఆడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు...బ‌హుళార్ద‌క ప్రాజెక్ట్  పోల‌వ‌రం ముంపు గ్రామాల‌ను ఒక ఆర్డినెన్స్ తో చేర్చిన మోడీ…. ఒక వేళ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు కావాల్సి వ‌స్తే నాలుగేళ్లు ఆగేవారా.... అని ప్ర‌శ్నించారు. చ‌ట్టంలో లోపాలు ఉంటే మెజారిటీ ఉన్న బీజేపీ  స‌వ‌ర‌ణ‌లు చేయ‌వ‌చ్చు క‌దా..? దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని అన్నారు. మొత్తానికి జైరామ్ ర‌మేష్ ముడుపుల  ఆధారాలు తొంద‌ర‌లో బ‌య‌ట‌పెడ‌తారు అంటున్నారు ఏపీ కాంగ్రెస్ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.