అవిశ్వాస తీర్మానం పై కాంగ్రెస్‌ కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

no confidence motion
Updated:  2018-03-23 04:26:00

అవిశ్వాస తీర్మానం పై కాంగ్రెస్‌ కీల‌క నిర్ణ‌యం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్ర‌క‌టించాలంటూ రాష్ట్రంలో ఉన్న‌టువంటి అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ కేంద్ర ప్ర‌భుత్వం పై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌క‌టించిన విష‌యం అంద‌రికి తెలిసిందే. దీన్ని చ‌ర్చించాలంటూ  ఏపీకి చెందిన‌ ఎంపీలు స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజన్‌ను కోరుతున్నారు. ప్ర‌త్యేకహోదా అంశం పార్ల‌మెంట్‌ను సైతం స్థంభింప చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 
 
తాజాగా ప్ర‌త్యేక‌హోదా అంశంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీకి విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను, ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించ‌డంలో విఫ‌ల‌మైన ఎన్డీఏ సర్కారుపై కాంగ్రెస్‌ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం పై నోటీసులు అంద‌జేసింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే  ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను కలిసి నోటీసులు ఇచ్చారు... ఆయన వెంట ఏపీ మాజీ ఎంపీ జేడీ శీలం కూడా ఉన్నారు.
 
కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చాలా మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నార‌ని, అందువ‌ల్ల‌  చర్చకు అవకాశం కల్పించాల్సిందేనని జేడీ శీలం మీడియాతో అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్ర‌క‌టించేంత వ‌ర‌కు బీజేపీ పై కాంగ్రెస్‌ పోరాడుతూనే ఉంటుందని ఆయ‌న స్పష్టం చేశారు. ఇదే అంశం పై వైఎస్సార్‌సీపీ, టీడీపీలు విడివిడిగా ఇచ్చిన నోటీసులు చర్చకు వచ్చినా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలబడుతుంద‌ని జేడీ శీలం తెలిపారు. 2019 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధిస్తే మొట్ట‌మొద‌ట చేసే ప‌ని ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించ‌డ‌మే అని తెలియజేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.