టీడీపీ పై తుల‌సి రెడ్డి ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-12 03:51:19

టీడీపీ పై తుల‌సి రెడ్డి ఫైర్

ఇటీవ‌ల కేంద్ర‌ బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు జ‌రిగిన అన్యాయం అంద‌రికి తెలిసిందే. ఇందుకుగానూ  పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ల‌కార్డ్‌లు ప్ర‌ద‌ర్శిస్తూ, నినాదాలు చేశారు టీడీపీ ఎంపీలు. వీరు చేసిన నిర‌స‌న‌ల‌ను టీడీపీ ఆస్థాన మీడియా త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేసింది. 
 
పార్ల‌మెంట్ స‌మావేశాలు ముగిసిన త‌ర్వాత‌ రాష్ట్రానికి వ‌చ్చిన టీడీపీ ఎంపీల‌కు ఘ‌నంగా స‌న్మానం కూడా జ‌రిగింది. ఈ స‌న్మానాల పై కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు తుల‌సిరెడ్డి  ఘాటుగా  స్పందించారు. న‌ష్ట‌పోయిన న‌వ్యాంధ్ర‌కు కేంద్రం నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం ఏం సాధించింద‌ని  ప్ర‌శ్నించారు. స‌త్కారాలు చేయించుకోవ‌డానికి నైతిక‌త ఉండాల‌ని  ఆయ‌న విమ‌ర్శించారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో  ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు కోసం ప్ర‌శ్నించ‌డం విడ్డూరం అని అన్నారు.
 
గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా బీజేపీ, టీడీపీ క‌లిసి రాష్ట్రాన్ని  న‌ట్టేట ముంచాయి. బీజేపీ వ‌ల్ల న‌ష్టం జ‌రిగిందంటూ టీడీపీ చేస్తున్న ప్ర‌చారాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని ఆయ‌న‌ అన్నారు. పోరాటాలు చేయాల్సిన స‌మ‌యంలో టీడీపీ ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోయింద‌ని విమ‌ర్శించారు. గతంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వం బాగా సహాయం చేస్తోందంటూ  టీడీపీ నేతలు అసెంబ్లీలో స్వీట్లు పంచుకున్న విష‌యాన్ని తులసీ రెడ్డి గుర్తుచేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.