జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి మ‌హీధ‌ర్ రెడ్డి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-11 13:54:53

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి మ‌హీధ‌ర్ రెడ్డి

ప్ర‌తిప‌క్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ప్ర‌స్తుతం తూర్పు గోదావరి జిల్లాలో నిర్విరామంగా కొన‌సాగుతుంది. అయితే ఈ పాద‌య‌త్ర‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా ఇసుక వేస్తే రాల‌నంత జ‌నాలు హాజ‌రు అయి జ‌న‌నేత జ‌గ‌న్ కు నీరాజనాలు తెలుపుతున్నారు. ఈ సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ ముందుకు సాగుతుతున్నారు. 
 
ఇక‌ మ‌రో వైపు అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఫ్యూచ‌ర్ రాజ‌కీయాల‌ను దృష్టిలో ఉంచుకుని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటున్నారు. అయితే ఇప్ప‌టికే టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు అంద‌రూ వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు మాజీ మంత్రి మహీధ‌ర్ రెడ్డి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు.  వైసీపీలో చేరేందుకు వ‌చ్చిన ఆయ‌న‌ను వైఎస్ జ‌గ‌న్ స‌గ‌ర్వంగా పార్టీలోకి ఆహ్వానికంచి పార్టీ కండువా క‌ప్పారు.
 
ఆ త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి వైఎస్ జ‌గ‌న్‌ నాయ‌క‌త్వం ఎంతో అవ‌స‌రం అని ఆయ‌న తెలిపారు. అయితే ప్ర‌స్తుతం రాష్ట్రంలో  ఎవ‌రైనా వైఎస్ జ‌గ‌న్ ను బ‌ల‌ప‌రిచే విధానాలు ఉన్నాయని మహీధ‌ర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గుడ్డు పరిస్థితిల్లో ఉంద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. 
 
2014లో అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు రాష్ట్ర అభివృద్ది చేయ‌కుండా త‌న సొంత అభివృద్దిని చేసుకుంటున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. 2019లో వైఎస్ జ‌గ‌న్ కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒక్క‌సారి అవ‌కాశం ఇచ్చి చూడండి తండ్రిని మించిన కొడుకు అవుతార‌ని మహీధ‌ర్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.