ఏపీ కోసం కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-19 12:41:34

ఏపీ కోసం కాంగ్రెస్ సంచ‌ల‌న నిర్ణ‌యం

విభ‌జ‌న పాపాన్ని ముటగ‌ట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  మ‌ళ్లీ పురుడు పోసుకునేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే స‌రైన స‌మ‌యంలో   సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునేందుకు  కాంగ్రెస్ పార్టీ  నాయ‌కులు సిద్ద‌మ‌య్యారు.
 
ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోతే  ఏప్రిల్ 6 వ తేదీన తమ పార్టీ ఎంపీలు చేత రాజీనామా చేయిస్తాన‌ని ఏపీ ప్ర‌తిప‌క్ష నేత  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేశారు. ఇక విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను నెర‌వేర్చాలంటూ మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీని డిమాండ్ చేశారు ఏపీ సీఎం చంద్ర‌బాబు.
 
మ‌రోవైపు రాజీనామాలు కాదు కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టండి  అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైకాపాకు పిలుపునిచ్చారు. దీంతో అవిశ్వాసం పెట్టేందుకు తాము సిద్దంగా ఉన్నాము..త‌మ‌కు అవిశ్వాసం పెట్టేంద‌కు కావాల్సి ఎంపీల సంఖ్య లేదు కావున,  బీజేపీ స‌ర్క‌ర్ పై  టీడీపీ అవిశ్వాస తీర్మానం  పెడ‌తామ‌న్నా...తాము  మ‌ద్ద‌తు ఇస్తామంటూ వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేశారు.
 
మొత్తానికి ఏపీలో అన్ని పార్టీలు భార‌తీయ జ‌న‌తా పార్టీపై యుద్దం చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నాయి. ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేత‌లు రెడీ అయ్యారు. ఏపీకి జ‌రిగిన అన్యా యంపై కేంద్ర ప్ర‌భుత్వం  మీద అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ద‌మైంది ఏపీ కాంగ్రెస్ పార్టీ. 
 
ఇందుకు సంబంధించి పార్టీ అధిష్టానంతో  సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ నేత‌లు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల నేప‌ధ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర‌పై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెడితే ఏపీలో ఉన్న పార్టీల‌న్నీ రాజ‌కీయాల‌కు అతీతంగా మ‌ద్ద‌తు ఇవ్వాల్సి ఉంటుంది. 
 
ఇదే జ‌రిగితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిజంగానే మ‌ర‌లా పురుడు పోసుకునే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం తెలుగు ప్ర‌జలు బీజేపీ  న‌మ్మించి చేస్తున్న  ద్రోహంతో  పోలిస్తే కాంగ్రెస్ న‌యం అనే ప‌రిస్ధితికి వ‌చ్చారు. త్వ‌ర‌లోనే అవిశ్వాస తీర్మానం అంశంపై అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు కాంగ్రెస్ పార్టీ నేత‌లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.