వైసీపీలోకి మరో సీనియర్ నేత

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-18 16:12:41

వైసీపీలోకి మరో సీనియర్ నేత

ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఏ ముహూర్తాన ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారో కానీ, ఆరోజు నుండి ఇప్పటివరకు జగన్ చుట్టూ జనసంద్రోహం వెల్లువలా ఉంది...జగన్ ఏ జిల్లాకు వెళ్లిన అక్కడ రెట్టించిన ఉత్సహంతో ప్రజలు జగన్ కు మద్దతు తెలపడంతో...జన కూడా అంతకు రెట్టించిన ఉత్సహంతో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
 
జగన్ పాదయాత్ర కృష్ణాజిల్లాకు మారే సరికి సీన్ మారిపోయింది...టీడీపీకి కంచుకోట అయినా ఆ జిల్లా నుంచే వైసీపీలోకి చేరికలు ఊపందుకున్నాయి...కృష్ణా జిల్లాలో చాల మంది సీనియర్ నాయకులూ వైసీపీలో చేరారు...ఇప్పుడు జగన్ పాదయాత్ర టీడీపీకి కంచుకోట అయినా పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంది...ఈ జిల్లా 2014 ఎన్నికలలో వైసీపీకి షాకిచ్చింది...15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న ఈ జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది...అదే జిల్లా ఇప్పుడు టీడీపీకి షాకిస్తుంది.
 
జగన్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాకు రాగానే సీన్ మారిపోతుంది అనుకున్నారు...కానీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు జగన్ కి తెలుపుతున్న మద్దతు చూసి టీడీపీ నాయకులు కంగుతిన్నారు...ఇది ఇలా ఉంటే పశ్చిమ గోదావరిలో కూడా పాదయాత్రలో ఉన్న జగన్ దగ్గరికి  వివిధ జిల్లాల నుండి వచ్చి వైసీపీ కండువా కప్పుకుంటున్నారు.
 
ఇప్పటికే రాలయసీమ మాజీ ఐజి షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ జాయిన్ అవ్వగా...ఇప్పుడు మరో కాంగ్రెస్ సీనియర్ నేత జంగారెడ్డిగూడెంకు చెందిన ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మెన్‌ పీపీఎన్‌ చంద్రరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. యనకు జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు...ఈ  జనసంద్రోహం, ఈ చేరికలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి షాక్ ఇస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.