అమ‌రావ‌తిలో విషాదం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

amaravathi
Updated:  2018-10-08 12:29:37

అమ‌రావ‌తిలో విషాదం

అమ‌రావ‌తి రాజ‌ధానిలో స‌రోగసి వివాదం క‌ల‌క‌లం రేపుతోంది. తాడేప‌ల్లిలో ఓ యువ‌తి నిద్ర‌మాత్ర‌లు మింగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఈమెను రెండునెల‌ల క్రితం విజ‌య‌వాడ‌లోని కార్తీక ఆసుపత్రిలో బల‌వంతంగా స‌రోగ‌సి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. 
 
దీంతో కొద్దిరోజుల క్రితం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ఆసుప‌త్రి యాజ‌మాన్యాన్ని అదుపులో తీసుకున్నారు. అయితే ఈ క్ర‌మంలో కేసుని రాజీ చేసుకోవాలంటూ బెదిరింపులు రావ‌డంతో నిన్న ఆమె ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ప్ర‌స్తుతం ఆ యువ‌తి విజ‌య‌వాడ‌లోని ఓ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుంది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.