టీడీపీ స‌ర్కార్ లో పైస‌లిస్తే....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-21 05:54:49

టీడీపీ స‌ర్కార్ లో పైస‌లిస్తే....

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో లంచాలు తీసుకుంటారని ఎవ‌రికైనా చెబితే, ఆ విష‌యాన్ని ఎంత తేలిక‌గా తీసుకుంటారో అంద‌రికీ తెలుసు. ప్ర‌స్తుత ప‌రిస్ధితుల్లో లంచం అనేది ప్ర‌జాస్వామ్యంలో ఓ భాగంగా మారింది. లంచం ఇవ్వ‌డం ఎంత‌ నేర‌మో..లంచం తీసుకోవ‌డం కూడా అంతే నేరం. 
 
ప్ర‌జ‌ల అవ‌స‌రాన్ని ఆస‌రాగా మ‌లుచుకుంటున్న ప్ర‌భుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ వంద‌ల కోట్లు అక్ర‌మంగా సంపాదిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా రెవెన్యూ శాఖ‌లో జ‌రుగుతున్న అవినీతి తారా స్ధాయికి చేరుకుంది. ఎన్నిసార్లు అవినీతి నిరోద‌క శాఖ అధికారులు దాడులు నిర్వ‌హించి ప‌ట్టుకున్నా కూడా ప్ర‌భుత్వ అధికారుల తీరు మారటంలేదు. 
 
2014 ఎన్నిక‌ల త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో అవినీతి మితిమిరి పోయింద‌నే చెప్పాలి. వంద‌ల కొద్ది అవినీతి తిమింగ‌ళాల‌ను ప‌ట్టుకుంది ఏసీబీ. ఏపీలో వంద‌ల కోట్ల ఆస్తులు కూడ‌గ‌ట్టిన ఎంద‌రో ప్ర‌భుత్వ అధికారుల‌ను ఏసీబీ బ‌య‌ట‌కు లాగింది. బెస్ట్ అడ్మినిస్ట్రేటివ్‌ అని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఇలా  పెద్ద ఎత్తున అవినీతి జ‌రుగుతుండ‌టం నిజంగా దుర‌దృష్ట‌క‌రం. 
 
ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌న్నీ కూడా డిజిటలైజేష‌న్ చేసి ప్ర‌జ‌ల‌కు నేరుగా ఫ‌లాలు అందేలా చేసినా ఎక్క‌డో ఒక‌చోట అధికారులు వ‌సూలు మాత్రం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గడం, రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించ‌డం, ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటుకు భూ సేక‌ర‌ణ‌లు వంటి అనేక కార‌ణాల చేత రెవెన్యూ, రెవిన్యూ శాఖ‌ల్లో అక్ర‌మాల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. 
 
ఏదైనా ప‌ని జ‌ర‌గాలంటే ఆమ్యామ్యాలు ఇచ్చుకోవాల్సిందే. అన్ని స‌క్ర‌మంగా ఉన్నా ఇవ్వాల్సిందే.....అక్ర‌మంగా ఉన్నా ఇస్తే ప‌ని జ‌ర‌గాల్సిందే. ఏదైనా స‌రే టీడీపీ  స‌ర్కార్ లో పైస‌లు ఇస్తే  ఇట్టే పని అయిపోతుందన్న‌ట్లుగా మారిపోయింది. ఇలాగే కొన‌సాగితే లంచాల‌కు మ‌న తెలుగు రాష్ట్రాలు పుట్టినిల్లుగా చెప్పుకోవాల్సిన ప‌రిస్ధితి వ‌స్తుంది. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటే మంచిద‌ని కోరుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.