మొత్తం ఫిరాయింపుల విలువ‌ ఎన్నికోట్లంటే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-06 14:56:50

మొత్తం ఫిరాయింపుల విలువ‌ ఎన్నికోట్లంటే

నా వెన‌కాల పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఉన్నారు, ఆయ‌న వెనుక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నారు, ఆయ‌న వెనుక వైసీపీ జెండా ప‌ట్టుకున్న కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌లు ఉన్నారు.. ఇదే వైసీపీ ఎమ్మెల్యేల దైర్యం, అల్లాఉద్దీన్ అద్బుత దీపం సినిమా చూపించి వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు ఎర్ర‌టి తివాచి చూపి టీడీపీలోకి ఆహ్వ‌నించారు.. చివ‌ర‌కు పార్టీలో చేరిన త‌ర్వాత వారి స్దితి మ‌రీ దారుణంగా మారిపొయింది. ఇదే  వేద‌న తీవ్ర‌మ‌నోవేద‌న  వైసీపీ ఫిరాయింపుల్లో మ‌రింత పెరిగిపోయింది.
 
అయితే ఈ స‌మ‌యంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేల‌కు టెంప్ట్ అయ్యే ఆఫ‌ర్లు ఇవ్వ‌డం చాలా దారుణం అని వైసీపీ విమ‌ర్శిస్తోంది..వైసీపీని రాజ‌కీయంగా జ‌గ‌న్ కు వేద‌న మిగిల్చాలి అని టీడీపీ భావిస్తోంది.. అయితే  అది జ‌రిగేది కాదు అనేది రాష్ట్రం అంతా తెలిసిందే.. ఇక  గ‌తంలో తిరువూరు ఎమ్మెల్యే రక్ష‌ణ నిధి కూడా ఇలాంటి ఆఫ‌ర్ త‌న‌కు ఇచ్చారు అని అధికార పార్టీ పై వేడినీళ్లు చ‌ల్లారు.. అయినా తాను పార్టీ మార‌ను అని తెలియ‌చేశారు.. ఇటు పూత‌ల ప‌ట్టు ఎమ్మెల్యే డాక్ట‌ర్ సునీల్ కూడా, 40 కోట్ల రూపాయ‌లు త‌న‌కు టీడీపీ ఆఫ‌ర్ చేసింది అని చెప్ప‌డం పెద్ద చర్చ‌నీయాంశం అయింది.
 
ఇక తెలుగుదేశం త‌ర‌పున నాయ‌కులు మాత్రం ఎటువంటి స్పంద‌న దీనిపై స్పందించ‌లేదు.. ముఖ్యంగా పార్టీ త‌ర‌పున ఇటువంటి డీల్ ఎవ‌రు చేశారు;  అనేది పార్టీ ఇంట‌ర్న‌ల్ చ‌ర్చ‌...కేవ‌లం ఇద్ద‌రు నాయ‌కులు చేశార‌ట.. అయితే ఇది ఇప్పుడు ఇచ్చిన ఆఫ‌ర్ కాదు అని తెలుస్తోంది. ఏ నాడో జ‌రిగిన డీల్ అట‌.. అయితే ఆయ‌న వెనుక పెద్దిరెడ్డి కుటుంబం ఉంది ఆయ‌న‌కు జ‌గ‌న్ సీటు ఇవ్వ‌డంలో ఎటువంటి ఢోకాలేదు. 
 
అయితే ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశం..పార్టీ  ఫిరాయిస్తే ఒక్క‌క్క‌రికి 40 కోట్లు, ఈ లెక్క‌న 23 మంది ఎమ్మెల్యేల‌కు 920 కోట్లు.. దీంతో ఏదైనా ఓ పెద్ద ప్రాజెక్ట్,  ప్ర‌భుత్వ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్ట‌వ‌చ్చు.. ఐదు సెగ్మెంట్ల‌లో ప్ర‌తీ పేద‌వాడికి ఇళ్లు క‌ట్టించి ఇవ్వ‌చ్చు..అస‌లు నిజంగా ఇన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసి జ‌గ‌న్ ని ఓడించాల‌ని ఆయ‌న మ‌నోధైర్యం  దెబ్బ తీయాల‌ని భావించారు..కానీ సాధించింది ఏమీ లేదు అని వైసీపీ ఘంటాప‌దంగా చెబుతోంది..?

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.