కౌంట్ డౌన్ స్టార్ట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

nara chandrababu naidu fake politics
Updated:  2018-05-15 02:40:54

కౌంట్ డౌన్ స్టార్ట్

తెలుగుదేశం పార్టీకి క‌న్న‌డ ఫ‌లితాల‌తో కంటిలో న‌లుసు ఎర్ర‌గా మారి పుండులా మారిపోయింది.. డిబేట్ల‌లో కూడా క‌న్న‌డ ఫ‌లితాల‌పై మ‌న‌సు విప్పి మాట్లాడ‌లేని విధంగా ఉన్నారు తెలుగుదేశం నేత‌లు. క‌ర్నాట‌క ఫ‌లితం ఇక పూర్తి మెజార్టీ దిశ‌గా బీజేపీ దూసుకుపోతోంది.మ‌రో ప‌క్క బీజేపీకి ఓట్లు వేయ‌వ‌ద్దు అని ప్ర‌చారం చేసిన తెలుగుదేశం నాయ‌కుల ఎత్తులు పాచిక‌లు పార‌లేదు అనే చెప్పాలి.
 
తెలుగుదేశం నాయ‌కులు చెప్పిన మాట‌ల‌కు ఎటువంటి ప్ర‌తిఫ‌లం లేకుండా పోయింది. ప‌చ్చ‌ని ప్ర‌చారం బెంగ‌ళూరులో చంద్ర‌బాబు చేయాలి అని అనుకున్నారు అని ఇప్ప‌టికే అక్క‌డ కొంత మంది వ్య‌తిరేకించింది తెలిసిందే.ఇక సిద్దరామ‌య్యకు జేడీఎస్ కు ఓటు వేయాలి అనేలా తెలుగుదేశం ప్ర‌చారం చేసింది చివ‌ర‌కు ప‌రిస్దితి మారిపోయింది.
 
తెలుగుదేశం నాయ‌కులు ఎటువంటి స్టేట్ మెంట్లు ఇచ్చేందుకు రెడీగా లేరు.ఇక పార్టీ త‌ర‌పున బీజేపీ ముందు నుంచి చెప్పిన విధంగా య‌డ్యుర‌ప్ప‌ను సీఎంగా చేసే అవ‌కాశం ఉంది.సాయంత్రం ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశం జ‌రుగ‌నుంది.అమిత్ షా-ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఇప్ప‌టికే ఆయ‌న‌ను సీఎం చేయాలి అని నిర్ణ‌యించుకున్నారు.ఇక కాంగ్రెస్, సీఎం సిద్ద‌రామ‌య్య వ‌ర్గం షాక్ నుంచి తేరుకోలేదు. ఇటు రాహుల్ గాంధీ ప్ర‌చారం రెండు వారాలు చేసినా ఇక్క‌డ ఎటువంటి ఫ‌లితం లేకుండా పోయింది.
 
అయితే బీజేపీ ఏపీ ఇన్ చార్జ్ రామ్ మాధ‌వ్ ట్వీట్ ఇప్పుడు ఏపీ తెలుగుదేశంలో కాక పుట్టిస్తోంది.చంద్ర‌బాబు పేరును ఉద్దేశించి ఆయ‌న తెలియ‌చేశారు. సీఎం చంద్ర‌బాబు బీజేపీకి క‌ర్ణాట‌క‌లో ఓట్లు వెయ్య‌ద్దు అని ప్ర‌చారం చేయించారు. ఎన్నో కుట్ర‌లు చేశారు బీజేపీ ఓట‌మికి క‌న్న‌డ‌లో తెలుగుదేశం నాయ‌కులు అని అన్నారు. అయినా తెలుగుప్ర‌జ‌లు బీజేపీకి ఓట్లువేశార‌ని ఇక ద‌క్షిణాదిన బీజేపీ విజ‌య‌యాత్ర మొద‌లు అవుతుంది అని అన్నారు. మొత్తానికి చంద్ర‌బాబు స‌ర్కారుకు త్వ‌ర‌లోనే ఓ ఎండ్ కార్డ్ వేసేలా బీజేపీ ప్లాన్ వేస్తోందా అని విశ్లేష‌కులు భావిస్తున్నారు. 
 
మ‌రీ ముఖ్యంగా ఈ విజ‌యం పై ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన చంద్ర‌బాబు ఎటువంటి కామెంట్లు చేస్తారు. అనేది చూడాలి, ఇటు క‌న్నాకు ఏపీబీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి ఇచ్చిన రెండురోజుల‌కే క‌న్న‌డ ఫ‌లితాల‌తో ఏపీ బీజేపీలోకూడా కొత్త జోష్ వ‌చ్చింది అని చెప్పాలి అంటున్నారు విశ్లేష‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.