ఏపీలో సీపీఐ- సీపీఎం జ‌న‌సేన కొత్త వేదిక

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

cpm-cpi-pavan image
Updated:  2018-03-31 05:42:18

ఏపీలో సీపీఐ- సీపీఎం జ‌న‌సేన కొత్త వేదిక

ఏపీలో వామ‌ప‌క్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంతో పాటు జ‌న‌సేన‌తో క‌లిసి సరికొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.... ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యలపై ప్ర‌త్యేక‌మైన‌ పోరాటం చేస్తుందని ప్రకటించారు. దీనికి సంబంధించిన‌ తొలిసభను రాయ‌ల‌సీమ‌లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు. ఈ పోరాటానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కలిసి వస్తే ఆహ్వానిస్తామన్నారు. 
 
ఏపీకి ప్రత్యేక హోదా ప్ర‌క‌టించ‌కుండా ప్ర‌ధాని మోదీ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిప‌డ్డారు....రాష్ట్రంలో ఉన్న అన్ని రాజ‌కీయ పార్టీలు కేంద్రం పై అవిశ్వాసం ప్ర‌క‌టిస్తే దాన్ని చ‌ర్చ‌కురాకుండా ఉండ‌డానికి ప్ర‌ధాని మోదీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు.... మోదీ నియంతృత్వానికి బ‌లైన సోంత పార్టీ ఎంపీలు, ఎక్క‌డ అవిశ్వాసానికి మ‌ద్ద‌తు తెలిపితే  ఎన్డీయే ప్ర‌భుత్వం ప‌డిపోతుంద‌న్న భ‌య‌మే ప్ర‌ధాని మోదీని  వెన‌క‌డుగు వేసేలా చేస్తోంద‌ని అన్నారు.
 
ఏపీకి ప్ర‌క‌టించాల్సిన ప్ర‌త్యేక‌హోదా పై పార్లమెంట్‌ చివరి రోజున‌ కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే బ్లాక్‌​ డే నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోజు సాయంత్రం లైట్స్‌ ఆపేసి చీకటి దినంగా పాటిస్తామని తెలిపారు... మొత్తానికి జ‌న‌సేన క‌మ్యూనిస్టుల‌తో జ‌త క‌డుతుంది అని అనుకున్న‌ట్లే  ముందుకు వెళుతోంది అని విశ్లేష‌కులు భావిస్తున్నారు.
 
 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.