టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా ? సీపీఐ బ‌హిరంగ లేఖ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-30 11:55:57

టీడీపీ ఎమ్మెల్యే రాజీనామా ? సీపీఐ బ‌హిరంగ లేఖ

విజ‌య‌వాడ మూడు సెగ్మెంట్ల‌లో ఓ ఫిరాయింపు సెగ్మెంట్ తో ప్ర‌జ‌లు అక్క‌డ జ‌లీల్ పై వ్య‌తిరేక‌త చూపుతుంటే, ఇటు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు వివాదం ఇప్పుడు తెర‌పైకి వ‌చ్చింది.. ఎమ్మెల్యే భూక‌బ్జా అంశం విజ‌య‌వాడ నుంచి వ‌యా అమ‌రావ‌తి అంతా పాకేసింది. దీంతో తెలుగుదేశానికి కృష్ణా జిల్లాలో మ‌రో మ‌చ్చ అని చెప్ప‌వ‌చ్చు.

స్వాతంత్య్ర‌ సమరయోధుడి భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యే బోండా తక్షణం పదవికి రాజీనామా చేయాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. విజయవాడలో భూదందాలకు ఎమ్మెల్యే బోండా కేరాఫ్‌గా మారారని ధ్వజమెత్తింది. సీఎం చంద్రబాబునాయుడు ఎందుకు బోండాపై చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ ఒక బహిరంగ లేఖ రాశారు.

విజ‌య‌వాడ‌లో ఈ భారీ కుంభ‌కోణం వెలుగులోకి రావ‌డంతో తెలుగుదేశం నాయ‌కులను ప్ర‌శ్నిస్తుంటే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు స‌మాధానాలు లేక ఉంటున్నారు... ఓ స్వాతంత్య్ర సమరయోధుడికి చెందిన సుమారు రూ.40 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే బోండా కుటుంబం యత్నించింది. ఆ భూమికి నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలను తయారుచేయించి, రామిరెడ్డి కోటేశ్వర్‌రావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు ఆధారాలు సృష్టించారు. స‌ద‌రు కుటుంబానికి చెందిన వ్య‌క్తిని త‌మ స్ద‌లంలో కంచె వేయ‌డం పై ఏమిట‌ని ప్ర‌శ్నిస్తే ఎమ్మెల్యే మ‌నుషులు అక్క‌డ నుంచి పంపించేశార‌ని దీంతో సీఐడిని ఆశ్ర‌యించ‌డంతో ఈ త‌తంగం వెలుగులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

అప్పు అడిగిన పాపానికి సదరు కోటేశ్వర్‌రావు అనే వ్య‌క్తిని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లి మరీ సంతకాలు చేయించారు. సీఐడీ దర్యాప్తులోనూ ఎమ్మెల్యే భూదందా బట్టబయలైంది. దీంతో కొనుగోలుదారైన బోండా సుజాతపై కేసు నమోదయింది. మొత్తానికి దీనిపై ఎమ్మెల్యే ఎటువంటి స‌మాధానం చెప్ప‌డం లేదు, త‌మ‌కు సంబంధం లేదు అనే ధోర‌ణితో ఉన్నారు అని వైసీపీ విమర్శ‌లు చేస్తోంది.. త‌క్ష‌ణ‌మే ఇలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైసీపీ నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.