దీక్ష‌కు మ‌రో పార్టీ మ‌ద్ద‌తు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp mps aamarana nirahara deeksha
Updated:  2018-04-07 04:29:17

దీక్ష‌కు మ‌రో పార్టీ మ‌ద్ద‌తు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించాలి అంటూ ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎంపీలు నిన్న‌టి నుంచి ఆమ‌ర‌ణ‌ నిరాహారా దీక్ష చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే... వైసీపీ ఎంపీలు చేస్తున్న దీక్ష‌కు దేశ ప్ర‌జ‌లంతా వారివైపే చూస్తున్నారు... రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఇంత‌వ‌ర‌కూ ఏ రాజ‌కీయ నాయ‌కుడు చేయ‌లేని త్యాగాన్ని వైసీపీ ఎంపీలు రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు త్యాగం చేస్తున్నార‌ని ప‌లు పార్టీల నాయ‌కులు  వారికి సంఘీభావాన్ని తెలుపుతున్నారు. 
 
ఈ దీక్ష‌కు దేశ న‌లుమూల‌లా  వున్న తెలుగు ప్ర‌జ‌లే కాకుండా ఉపాధి రిత్యా విదేశాల‌కు వెళ్లిన తెలుగు ప్ర‌జ‌లు కూడా ఇంట‌ర్ నెట్, సోష‌ల్ మీడియాల‌లో వైసీపీ ఎంపీల‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు... ఏపీకి ప్ర‌త్యేక హోదా రాకుండా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నార‌ని, హోదా కోసం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నిరంత‌రం కేంద్రంతో ఫైట్ చేస్తుంటే దానిని అధికార తెలుగుదేశం నాయ‌కులు సినిమా చూసిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. 
 
 
ఇక తాజాగా వైసీపీ ఎంపీల దీక్షకు సీపీఎం కూడా అధికారికంగా మద్దతు తెలిపింది.. ఆ పార్టీకి చెందిన‌ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దీక్షా శిబిరానికి వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.వైసీపీ ఎంపీలతో పాటు దీక్షలో కూర్చొని ఏపీకి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజనతో అనేక సమస్యలు వస్తాయనే విషయాన్ని తాము ఎప్పుడో చెప్పామని, విభజన సమయంలో ఏపీకి ఐదేళ్లు కాదు, పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని అన్నారు... కానీ ఆ హామీని బీజేపీ నెరవేర్చలేకపోయిందని  ఏచూరి ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.