బాబు స‌న్నిహితుడు పై క్రిమినల్ కేసు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-06 18:40:52

బాబు స‌న్నిహితుడు పై క్రిమినల్ కేసు

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు నామా నాగేశ్వరరావు. 2009-2014 వ‌ర‌కు తెలంగాణాలోని ఖ‌మ్మం జిల్లాకు టీడీపీ ఎంపీగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు నామా నాగేశ్వరరావు. తాజాగా మాజీ ఎంపీ అయిన నామా నాగేశ్వరరావు పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది.
 
తన భార్యతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకోవటమే కాకుండా  భర్తకు విడాకులు ఇచ్చి తనతోనే ఉండాలంటూ వేధిస్తున్న నామాపై బాధిత మహిళ భర్త పోలీస్ స్టేష‌న్లో కేసు న‌మోదు చేయించ‌డం సంచలనంగా మారింది. కేసు న‌మోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ద‌ర్యాప్తు కోన‌సాగిస్తున్నారు.  
 
వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 4లో నివసించే సీకే రామకృష్ణన్ 1992 నుంచి అమెరికాలో ఉంటున్నారు. ఆయన సతీమణి సుజాత హైదరాబాద్ లోనే ఉండేవారు. 2014లో రామకృష్ణన్ హైదరాబాద్ కు వచ్చారు. ఆ సమయంలో మాజీ ఎంపీ నామా తరచూ తమ ఇంటికి వస్తుండేవారు. 2017లో తన భార్య సుజాతతో తరచూ ఫోన్లో మాట్లాడేవారని.. తాను అమెరికాలో ఉన్నప్పుడు తన భార్య తనకు ఫోన్ చేసిన నామా సోదరుడు బెదిరిస్తున్నాడని చెప్పిందన్నారు.
 
తనకు భయంగా ఉందని ఆమె చెప్పింది.. ఆ సమయంలో తన భార్య ఇచ్చిన ఫిర్యాదుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం రామకృష్ణన్.. హైదరాబాద్ కు వచ్చారు. తన భార్య తీవ్ర మానసిక వేదనతో బాధపడుతున్నట్లు గుర్తించి.. కారణం అడగ్గా.. నామాతో తనకు 2013 నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్లు తన భార్య చెప్పారన్నారు.
 
నీ భర్తకు విడాకులు ఇచ్చి నాతో ఉండు అంటూ నామా ఒత్తిడి తెస్తున్నారని.. భయానికి గురై తనకు చెప్పినట్లు రామకృష్ణన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నామా నాగేశ్వరరావు.. ఆయన సోదరుడు సీతయ్యపై ఐపీసీ సెక్షన్ 497.. 504.. 506 సెక్షన్ల కింత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.