ఐవైఆర్ కు మ‌రో ఘోర అవమానం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-22 03:05:45

ఐవైఆర్ కు మ‌రో ఘోర అవమానం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్యద‌ర్శి ఐవైఆర్ కృష్ణారావును చంద్ర‌బాబు స‌ర్కార్ మ‌రో సారి ఘోరంగా అవమానించింది. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోస్టింగ్ లు  షేర్ చేసినందుకుగానూ ఆయ‌న్ను  బ్రాహ్మ‌ణ కార్పోరేష‌న్ ప‌ద‌వి నుండి తొల‌గించిన విష‌యం తెలిసిందే. 
 
అనంత‌రం ఆయ‌న తీవ్ర స్ధాయిలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌ను తెలియ‌జేస్తూ వ‌స్తున్నారు. ఎప్పటిక‌ప్పుడు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను మీడియా  స‌మ‌క్షంలో  ఎండ‌గ‌డుతూనే ఉన్నారు. దీంతో ఐవైఆర్ కృష్ణా రావుపై మ‌రో కక్ష్య సాధింపు చ‌ర్య‌కు పాల్ప‌డింది టీడీపీ స‌ర్కార్. 
 
అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ ఫండ్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ పదవి నుంచి ఐవైఆర్‌ను తొలగిస్తూ... ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్ర‌భుత్వ లోపాలను ఎత్తి చూపిస్తున్నందున ఇలాంటి  చౌక‌బారు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని ప‌లువురు మండిప‌డుతున్నారు. 
 
 

షేర్ :

Comments

1 Comment

  1. చంద్రబాబు à°•à°¿ చేతనయిన విద్య అదే. జనం అవమానించే వరకు à°ˆ దారà±

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.