దోస్తీ కుదిరేనా...

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-28 12:37:17

దోస్తీ కుదిరేనా...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం నాడు చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌ద్ద‌నుకుంటే న‌మ‌స్కారం పెట్టి వ‌దిలేద్దామంటూ బాబు చేసిన వ్యాఖ్య‌ల‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు త‌మ‌దైన శైలిలో కౌంటర్లు వేశారు.

ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ ఎవ‌రితో పొత్తు పెట్టుకోనుంద‌నే దానిపై ఆసక్తి నెల‌కొంది. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్ధితులు గ‌మనిస్తే బీజేపీ-టీడీపీ దోస్తీ క‌టీఫ్ అయ్యేలా క‌నిపిస్తోంది. ఇదే జ‌రిగితే రానున్న రోజుల్లో ఏపీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు పూర్తిగా మారిపోనున్నాయి.

ముఖ్యంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ-భార‌తీయ జ‌న‌తా పార్టీ పొత్తు పెట్టుకోనుంద‌నే వార్త‌లు ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. హోదా ఇస్తామంటే ఏ పార్టీకైనా మద్ద‌తు ఇస్తామంటూ బీజేపీతో దోస్తికి వైయ‌స్ జ‌గ‌న్ ఇప్ప‌టికే సంకెతాలు పంపించేశారు.

ఏపీలో వేగంగా రాజ‌కీయాలు మారుతున్న త‌రుణంలో క‌మ్యునిస్లులు కూడా ఆచితూచి అడుగులు వేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు. బీజేపీతో క‌టీఫ్ చేసుకున్న తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలా.....అధికారంలోకి వ‌చ్చేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న జ‌గ‌న్ తో చేతులు క‌ల‌పాలా.... అనేదానిపై కూడా వ్యూహాలు రచిస్తున్నారు క‌మ్యునిస్ట్ పార్టీ నేత‌లు. మ‌రి వీరి అడుగులు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.