ద‌గ్గుబాటి జ‌గ‌న్ కు సాయం చేస్తారా ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-21 15:42:38

ద‌గ్గుబాటి జ‌గ‌న్ కు సాయం చేస్తారా ?

ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌రావు అంటేనే తెలుగుదేశం, కాంగ్రెస్ లో ఓ రాజ‌కీయ‌ అనుభూతి..ఆయ‌న మాట్లాడే మాట క‌చ్చిత‌త్వంగా ఉంటుంది.. ముక్కుసూటిగా ఉంటుంది.. అయితే ఆయ‌న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్నా, రెండు పార్టీల్లో ఆయ‌న‌కంటూ అభిమానులు ఉన్నారు, ఆయ‌న సీనియారిటీకి సిన్సియారిటీకి అభిమానులు ఫాలోవ‌ర్స్ ఉన్నారు. సొంత సెగ్మెంట్లో విజ‌యాలు ఆయ‌న‌కు సొంతం. ఇక తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ ఏ పార్టీ అయినా ఆయ‌న‌ను ఆద‌రించారు.
 
అయితే ఆయ‌న భార్య కూడా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా కూడా ప‌నిచేశారు.. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వ‌రి భ‌ర్త, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌రావు వెనుక రాజ‌కీయాల్లో న‌డిచారు.. తెలుగుదేశం కాకుండా కాంగ్రెస్ తో వారు ప్ర‌యాణించారు.. అయితే ఇప్పుడు ఆమె మాత్రం బీజేపీలో కొన‌సాగుతున్నారు.. ఇటు ఆయ‌న మాత్రం రాజ‌కీయాల‌కు దూరంగా పార్టీల‌తో అంటి ముట్ట‌న‌ట్లు ఉంటున్నారు... మొత్తానికి ఎన్టీఆర్ కు వెన్నుపోటు అంశాలు అన్ని ప‌రిశీలన‌గా పుస్త‌కంలో కూడా ఆనాడు ఏం జ‌రిగిందో వివ‌రంగా రాశారు ఆయ‌న‌.
 
ఇక తెలంగాణ పోరాటం పై కూడా పుస్త‌కం రాశారు.. అయితే ఆయ‌న ఇప్పుడు  పొలిటిక‌ల్ తెర‌పైకి మ‌ళ్లీ వ‌చ్చారు..జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల్లో మైలేజ్ పెరుగుతోంది అని అన్నారు ఆయ‌న‌.. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ కు విశేషంగా ఆద‌ర‌ణ వ‌స్తోంది.. పార్టీ ప్ర‌జ‌ల్లోకి వెళుతోంది అని చెప్పారు... అయితే ఇటు కేవీపీ కూడా కాంగ్రెస్ లో ఉన్నా ఆయ‌న జ‌గ‌న్ కు సాయం చేస్తున్నారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు ద‌గ్గుబాటి కూడా పొలిటిక‌ల్ గా రీఎంట్రీ ఇచ్చి జ‌గ‌న్ కు వెన్నంటి ఉంటారా అనే ప్ర‌శ్న లేవ‌నెత్తుతున్నారు కొంద‌రు.
 
ఇప్పుడు ఉన్న ప‌రిస్దితుల్లో ఆయ‌న పొలిటిక‌ల్ వేవ్స్ ఆలోచించి వైసీపీలో చేర‌తారా అనే కొంద‌రి ఆలోచ‌న.. మ‌రోప‌క్క తాను 2014 లోనే రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌ని చెప్పారు ఆయ‌న‌.. మ‌రి చూడాలి తెలుగుదేశం నుంచి కొంద‌రు ఇలా పార్టీలోకి వ‌చ్చి జ‌గ‌న్ కు సాయం చేసిన వారు ఉన్నారు... అలాగే కాంగ్రెస్ నుంచి వ‌చ్చి పార్టీలో అత్య‌ధిక భాగం నిలిచిన వారు ఉన్నారు.. ఇటు ద‌గ్గుబాటి కూడా వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది కాల‌మే నిర్ణ‌యించాలి.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.