నారాయ‌ణ నారాయ‌ణ ఇదేం ప‌ని

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-01 11:49:46

నారాయ‌ణ నారాయ‌ణ ఇదేం ప‌ని

తెలుగుదేశం ప్ర‌భుత్వం చేస్తున్న ప‌రిపాల‌నా విధానాన్ని రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. అయితే తాజాగా అధికార పార్టీలో ఉన్న‌టువంటి మంత్రులు, నాయ‌కులు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు  వ‌ల్ల సొంత పార్టీ నాయ‌కులే త‌ల దించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది... ఇప్ప‌టికే తెలుగుదేశంలో సొంత సామాజిక వ‌ర్గానికి ఎంతో ప్ర‌యారిటీ ఇస్తున్నారు అనే విమ‌ర్శ‌లు వారిపై వ‌స్తున్నాయి.
 
తెలుగుదేశం పార్టీలో దళితులకు ఇచ్చే ప్రాధాన్యమెంతో అంద‌రికి తెలిసిందే.  ద‌ళితతేజం అనే కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసి వారికి పార్టీ  ఇచ్చేప్రాధాన్య‌త  తెలియ‌జేయాల‌ని అధినేత చంద్ర‌బాబు, నాయ‌కుల‌కు ఆదేశించారు. తాజాగా  రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ నెల్లూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో ద‌ళిత నాయ‌కురాలికి ఘోర అవ‌మానం జ‌రిగింది ఈ ప‌ద్ద‌తి పై ద‌ళితులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.
 
ఈ స‌మావేశంలో నాయుడుపేటకు చెందిన‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శోభారాణిని కూర్చోనివ్వ‌కుండా మంత్రి  నారాయ‌ణ వెనుక నిల‌బెట్ట‌డం పై పార్టీ  నాయ‌కుల  నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  సమావేశం మొత్తం నాయకుల వెనుకనే నిల్చొనే ఉంది చైర్‌పర్సన్‌ శోభారాణి. మంత్రి నారాయణ ప‌లువురు టీడీపీ నేతలు చైర్‌పర్సన్‌ నిలుచుని ఉన్నా పట్టించుకోకుండా విలేకరుల సమావేశం ముగించారు.
 
ద‌ళితుల‌కు తెలుగుదేశం పార్టీలో ఇస్తున్న ప్రాధాన్య‌త  ఏమిట‌న్న‌ది మ‌రోసారి రుజువైంది. దీనిపై ద‌ళితులు విరుచుకుప‌డుతున్నారు.. ఓ ప‌క్క ద‌ళితుల‌కు పెద్ద పీట వేస్తున్నాం అని చెబుతున్న చంద్ర‌బాబు, త‌న మంత్రి వ‌ర్గం ఎటువంటి విలువ‌లు ద‌ళితుల‌కు ఇస్తున్నారో తెలుసుకోరా వీటిని నిల‌దీయ‌రా అంటూ విమ‌ర్శిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.