వైసీపీ మ‌రో కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-23 15:12:00

వైసీపీ మ‌రో కీల‌క నిర్ణ‌యం

వైసీపీ అధినేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ  అధ్య‌క్షుడు ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేకహూదా విష‌యంలో మరో పోరాటానికి సిద్దం అవుతున్నారు..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న మోసపూరిత విధానాలు, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 30వ తేదీన విశాఖపట్నంలో వంచన దినం పాటించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి వద్ద పాదయాత్ర శిబిరంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఈ విష‌యాన్ని సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు.
 
ఈ నెల 30న ఉదయం నుంచి సాయంత్రం వరకూ 12 గంటల పాటు రాజీనామాలు చేసిన పార్టీ లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు నిరాహారదీక్ష చేసి నిరసన తెలుపుతారని ఆయ‌న వెల్ల‌డించారు... ఆరోజున జగన్‌ తన పాదయాత్రను యథావిధిగా కొనసాగిస్తారని, అయితే నల్లజెండాలు, నల్ల రిబ్బన్లు ధరించి జ‌గ‌న్ యాత్ర సాగుతుందన్నారు.
 
ఇక చంద్ర‌బాబు మాత్రం త‌మ ఎంపీలు రాజీనామాల చేసిన స‌మ‌యంలో ఎవ‌రికి ఈ రాజీనామాల వ‌ల్ల ఉప‌యోగం అన్నారు.. అయితే బాబు 30 కోట్లు ప్ర‌జాధ‌నం ఖ‌ర్చుపెట్టి ఎవ‌రికి ఉప‌యోగం క‌లిగేలా ధ‌ర్మ‌పోరాట దీక్ష చేశారు అని వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.. ప్ర‌జా సొమ్మును ఇష్టం వ‌చ్చిన ట్లు ఖ‌ర్చుచేయ‌డంలో దేశంలో బాబును మించిన వారు లేరు అని విమ‌ర్శ‌లు చేస్తున్నారు వైసీపీ నాయ‌కులు. మ‌రో ప‌క్క సైకిల్ ర్యాలీలు, పువ్వులు చెవులో పెట్టుకుని నిర‌స‌న తెల‌ప‌డం అన్నీ ప్ర‌జ‌లు యువ‌త గ‌మ‌నిస్తున్నారు అని, వైసీపీ సీనియ‌ర్ నేతలు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.