ఫిరాయింపు నాయ‌కుడు దివాళా ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-10 05:24:56

ఫిరాయింపు నాయ‌కుడు దివాళా ?

పార్టీ  ఫిరాయించిన నెల్లూరు వైసీపీ మేయ‌ర్ అబ్దుల్ అజీజ్ కు  స్టార్ అగ్రో మెరైన్ ఎక్స్ పోర్ట్స్ - అండ్ ఇంపోర్ట్స్ అనే సంస్ద ఉంది....మేయ‌ర్ కు చెందిన ఆ సంస్ద దివాళా తీసినట్లు నేషనల్ కంపెనీస్‌ లా ట్రిబ్యునల్‌ సంస్థ ప్రకటించింది... దీంతో  మేయ‌ర్ సంస్ద‌కు చెందిన ఆర్దిక వ్య‌వ‌హ‌రాలు హాట్ టాపిక్ గా మారాయి.
 
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాకు రూ.270 కోట్లు బకాయిలు పడటంతో బ్యాంక్‌ ప్రతినిధులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ..దీంతో స్టార్ అగ్రో దివాళా తీసినట్లు ప్రకటిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ రిసీవర్‌ను నియమించింది.... చెన్నై కి చెందిన ప్రసాద్ జంపెక్స్‌ ఆర్థిక వ్యవహారాలతో స్టార్ అగ్రో బండారం బట్టబయలైంది. స్టార్ అగ్రో సంస్థకు మేయర్‌ అబ్దుల్ అజీజ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 
 
చెన్నై కి చెందిన ప్రసాద్ జంపెక్స్ అనే సంస్ద‌ రెండేళ్ల క్రితం రొయ్యల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. కంపెనీ కొనుగోలు చేసిన రొయ్యలను స్టార్ అగ్రో సంస్థలో ప్రొసెసింగ్ చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత స్టార్ అగ్రో, ప్రసాద్‌ జంపెక్స్ మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. స్టార్ అగ్రో రూ.40 కోట్లు బకాయి పడిందని తమ మెటీరియల్‌ను విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వకుండా ఎగనామం పెట్టిందని జంపెక్స్ సంస్ద ఆరోపిస్తోంది. 
 
స్టార్ అగ్రో ఆర్థిక లావాదేవీలు, ఎగుమతులు, దిగుమతుల చిట్టాను సేకరించారు. తర్వాత ఆయా బ్యాంకుల‌ నుంచి తీసుకున్న రుణాలను మద్రాస్ హైకోర్టుతో పాటు ఫెరా లాంటి అంతర్జాతీయ సంస్థల దృష్టికి తీసుకెళ్లింది. 
 
స్టార్ అగ్రో సంస్థ 2014-15లో 172 కోట్లు, 2013-15 ఆర్థిక సంవత్సరంలో ఫ్యాక్టరీ అభివృద్ధి కోసం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ.58 కోట్లు రుణం తీసుకుంది... ఈ అప్పు కాస్తా 2015-17 నాటికి రూ.270 కోట్లకు చేరింది. 
స్టార్ అగ్రో సంస్థ తీసుకున్న రుణాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (NPA)-నాన్-పెర్ఫార్మింగ్ అసెట్   కింద చూపించింది.
 
ఈ బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంక్‌ అధికారులు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. బకాయిలు రాకపోయినా బ్యాంకు అధికారులు రుణాలు ఎలా ఇచ్చారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.