ఫిరాయింపుల నోట జ‌గ‌న్ జై అనే మాట..?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-23 12:00:13

ఫిరాయింపుల నోట జ‌గ‌న్ జై అనే మాట..?

అనుకున్న‌ది ఒక‌టి అయిన‌ది ఒక‌టి ... లేనిదాని కోసం ఆరాట‌ప‌డితే ఉన్న‌ది క‌నుమ‌రుగైంద‌ని అలా ఉంది ఏపీలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పార్టీ ఫిరాయించిన నాయ‌కుల రాజ‌కీయ వేధ‌న‌... సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఏపీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో ఏపీకి అన్యాయం జ‌రిగింద‌ని, విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు నేర‌వేర్చాల‌ని టీడీపీ ఒక వైపు,  ప్ర‌త్యేక హూదాతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుంద‌ని,  ఎలాగైన హోదా సాధించుకోవాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ‌రో వైపు పోరాటాలు చేస్తున్నాయి.. ప్ర‌జ‌లు గొంతెత్తుతుంటే నాయ‌కులు ప్రేక్ష‌క పాత్ర‌వ‌హిస్తున్నారు... క్యాబేజీల‌కు ప్యాకేజీల‌కు సై అని త‌ల ఊపుతున్నారు.
 
త‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టుపెడుతున్నారు నాయ‌కులు అనే వాద‌న వస్తోంది.. దీంతో ఏపీ రాజ‌కీయాలు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో అధికార పార్టీ ఇచ్చిన‌టువంటి హామీలు నేర‌వేర్చ‌క‌పోవ‌డంతో, ప్ర‌జ‌ల్లో తీవ్ర‌ వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకుంది టీడీపీ స‌ర్కారు.
 
అయితే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షమైన వైసీపీ ప్ర‌భుత్వం పై నిత్యం పోరాడుతూ ప్ర‌జ‌ల్లో అభిమానాన్ని చోర‌గుంది..అలాగే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవ‌డానికి వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప పాద‌యాత్ర చేప‌ట్టి అనుక్ష‌ణం ప్ర‌జ‌ల మ‌ధ్యనే గ‌డుపుతున్నారు.  అధికార పార్టీ పెట్టే ప్ర‌లోభాల‌కు త‌మ నాయ‌కులు పార్టీ  వ‌దిలి వెళుతున్నా, మొండి ధైర్యంతో ముందుకు సాగుతున్నారు వైయ‌స్ జ‌గ‌న్‌.
 
పార్టీ ఫిరాయించి అధికార పార్టీలోకి వెళ్లిన నాయ‌కులు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఎలాగైన సీటు వ‌చ్చేలా వ్యూహాలు ర‌చించుకుంటున్నారు. అధికార పార్టీ పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌తను గ‌మ‌నించిన ఫిరాయింపు నాయ‌కులు, టీడీపీ పై త‌మ నిర‌స‌న గ‌ళాన్ని విప్పుతున్నారు... అందులో కొడుమూరు ఎమ్మెల్యే మ‌ణిగాంధీ చంద్ర‌బాబును చూసో, అభివృద్ధిని చూసో పార్టీ మార‌లేద‌ని,తన‌ను మాత్రం చంద్ర‌బాబు నాయుడు కొనేశాడ‌ని,నేను అమ్ముడుపోయాన‌ని బ‌హిరంగంగా చెప్ప‌టం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. ఇక అలాగే మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి ప‌చ్చిగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌న అర్ధ‌రూపాయి నాకు అర్ధ రూపాయి రామ‌సుబ్బారెడ్డికి అని చెప్ప‌డం, దేశంలోనే మిగిలిన రాజ‌కీయ పార్టీల ముందు తెలుగుదేశాన్ని త‌ల‌వంచే విధంగా చేసింది.
 
ఇక ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధుల‌ను కూడా ఇలాగే నాయ‌కులు తినేశారు అని ప్ర‌జ‌లు కూడా న‌మ్ముతున్నారు.. అందుకే కేంద్రానికి స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నారు అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక తాజాగా ప్ర‌కాశం జిల్లాలో ఇద్ద‌రు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉగాది త‌ర్వాత వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు అని, వైసీపీలో ఓ కీల‌క నాయ‌కుడితో రీ ఎంట్రీ గురించి చ‌ర్చిస్తున్నారు అని తెలుస్తోంది.. అలాగే తెలుగుదేశంలో ఎప్ప‌టి నుంచో క‌ష్ట‌ప‌డినా త‌మ‌కు గుర్తింపుల లేద‌ని, డ‌బ్బులు ఇచ్చిన వారికే ప‌ద‌వులు ఇస్తున్నారు అనే అసంతృప్తిలో మ‌రో ఇద్ద‌రు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు వారు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు.
 
అయితే ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో జ‌గ‌న్ కు వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు దృష్టిలో పెట్టుకుని జ‌గ‌న్ పంచ‌న చేర‌డానికి నాయ‌కులు రెడీ అవుతున్నారు.. దీంతో తెలుగుదేశానికి కొత్త‌గా భ‌యం ఏర్ప‌డింది.. కేడ‌ర్ నిలుపుకోక‌పోతే అధికార పార్టీ అబాసుపాలు అవుతుంది అన‌డంలో ఎటువంటి సందేహాం లేదు క‌దా.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.