తెర‌పై ఫిరాయింపు అక్ర‌మాలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

tdp
Updated:  2018-07-16 03:55:56

తెర‌పై ఫిరాయింపు అక్ర‌మాలు

విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గానికి జిల్లాలోలొ కాదు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. జిల్లా కేంద్రం విజ‌య‌న‌గ‌రం త‌ర్వాత అత్యంత విశిష్ట‌త కలిగిన ఈ రాచ‌న‌గ‌రం స్వాతంత్య్రానికి ముందు రావ్ భ‌హ‌దూర్ రంగారావు వంశ‌స్తులు ఏలు బ‌డిలో ఉండేది. ఆంధ్ర ఒడిస్సాను క‌లిపే ర‌హదారి ఈ నియోజ‌క‌వ‌ర్గం మీదుగా వెళ్తుంది. అయితే 2014 నాటికి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సుమారు 3 ల‌క్ష‌ల‌మంది జ‌నాభా ఉండ‌గా అందులో 1 ల‌క్షా 97 వేల 249 ఓట‌ర్లు ఉన్నారు, వీరిలో మ‌హిళా ఓట‌ర్లు 99,595 ఉండ‌గా పురుషుల ఓట్లు 97,645 మంది ఓట్లు ఉన్నాయి. 
 
నియోజ‌క‌వ‌ర్గంలో మెజార్టీ ఓట‌ర్లు కొప్ప‌ల వెల‌మ సామాజిక వ‌ర్గానిక చెందిన వారు ఎక్కువ‌గా ఉన్నారు. ఆ త‌ర్వాత తూర్పు కాపు ఓట‌ర్లు రెండ‌వ స్థానంలో ఉన్నారు. ఇక వీరి త‌ర్వాత ద‌ళిత ఓట‌ర్లు, మిగిలిన ఓట్లు బీసీ కులాలు అభ్య‌ర్థుల గెలుపు ఓట‌ముల‌ను నిర్ణ‌యిస్తారు. దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స్పూర్తితో రాజ‌కీయా అరంగేట్రం చేసిన సుజ‌య‌ కృష్ణారంగారావు 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌రుపున పోటీచేసి టీడీపీ అభ్య‌ర్థి ల‌క్ష్మానాయుడిపై 6958 ఓట్ల ఆధిక్య‌త‌తో గెలిచారు. అయితే ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశంపార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాజ్యాంగ విలువ‌ల‌కు విరుద్దంగా ప్రోత్స‌హించి ఫిరాయింపు రాజ‌కీయాల కార‌ణంగా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన సుజ‌య్ కృష్ణా రంగారావు అధికార పార్టీలో చేర‌డ‌మే కాకుండా ఏకంగా మంత్రి ప‌ద‌విని కూడా చేప‌ట్టారు. ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడు అనేక ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తిన సుజ‌య‌ మంత్రి అయిన త‌ర్వాత అవేవి త‌న‌కు తెలియ‌ద‌ని చెప్ప‌డం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.
 
పారిశ్రామిక రంగ ప్ర‌గ‌తికోసం విశేషంగా కృషి చేస్తాన‌ని చెప్పిన మంత్రి సుజ‌య్ కృష్ణారంగారావు ఆ దిశ‌గా వీస‌మెత్తుప‌నికూడా చేయ‌కున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తునే ఉన్నాయి. జూల్ ఫెర్రో అల్లాయిస్ పరిశ్ర‌మ‌ల నిర్వ‌హ‌ణ ప‌ర‌మైన స‌మ‌స్య‌లు మూత‌ప‌డుతున్నా వాటి  పరిష్కార‌ కృషికి ఏమాత్రం లేద‌ని కార్మిక సంఘాల నేత‌లే పెద‌వి విరుస్తున్నారు. భూగ‌ర్భ‌గ‌నుల శాఖ మంత్రిగా ఉండి కూడా జిల్లాలో పారిశ్రామిక ఉపాధి క‌ల్పించ‌లేక పోవ‌డం ద‌ర‌దృష్ట‌క‌రం అని వ్యాఖ్యానిస్తున్నారు. 
 
ప్ర‌ధానంగా బొబ్బిలి నియోజ‌క‌వ‌ర్గాన్ని వేధిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య  జూల్ మిల్లుల లాకౌట్ ఇందులో ప‌దివేల మంది కార్మికుల‌కు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఉపాధి క‌ల్పించే ఉపాధి పరిశ్ర‌మ‌లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌చ్చిన ఏడాదికే మూత ప‌డిపోయింది. ఇక ఈ స‌మ‌స్య త‌లెత్తే నాటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రంగారావు కార్మికుల‌తో క‌లిసి ఆందోళ‌న కూడా చేశారు. అయితే మంత్రి అయ్యాక కూడా ఓ సంద‌ర్భంలో ఈ స‌మ‌స్య‌ను పరిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చినా  ఈ విష‌యంపై ప‌ట్టించుకోవ‌డం మానేశారు. దీంతో విజ‌యన‌గ‌రం జిల్లా జూట్ కార్మికులు సెక్యురిటీ గార్డ్ లుగాను రిక్షా కార్మికులుగా మారిపోతున్నారు.
 
నియోజ‌క‌వ‌ర్గంలోని రామ‌భ‌ద్ర‌పురం ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద కూర‌గాయ‌ల విక్ర‌య కేంద్రంగా ప్ర‌సిద్ది చెందింది. కానీ ఇక్కడ కూర‌గాయ‌ల రైతులు సౌక‌ర్యాలు లేక నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణంతో పాటు మార్కెట్ యార్డ్ విస్త‌ర‌ణ చేప‌డ‌తాన‌న్న మంత్రి గారి హామీని ప్ర‌జ‌లు గుర్తుచేస్తున్నారు. మార్కెట్ యార్డ్ ను రైతుల‌కు వ్యాపారం జ‌రిగే చోటు కాకుండా ఊరికి దూరంగా చేస్తామ‌న‌డంపై రైతులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 
 
ఇక మ‌రోవైపు అన్ని అర్హ‌త‌లు ఉన్న పించ‌న్లు రాక ఇబ్బందులు పడుతున్న వృద్దుల అవ‌స్త‌లు ద‌య‌నీయంగా మారుతోంది. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హయాంలో త‌మ‌కు ప్ర‌తీ నెలకు పించ‌న్ వ‌చ్చేద‌ని అయితే ఇప్పుడు రావ‌డంలేద‌ని వృద్దులు వాపోతున్నారు. ఇక దీంతోపాటు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో కీల‌క‌మైన రంగం వ్య‌వ‌సాయ రంగం, సువ‌ర్ణ‌ముఖీ వేగావ‌తి న‌దులు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌వ‌హిస్తున్నా గ‌రిష్టంగా పంట‌ల‌సాగు అంతా వ‌ర్షం మీదే ఆధార‌ప‌డి ఉంటోంది. 
 
తోట‌ప‌ల్లి కాలువ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోతుండ‌టంతో సాగునీరు ద‌క్కుతుంద‌నే ఆశ‌తో ఉన్నా కూడా నిరాశే మిగిల్చింది. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో వెంగ‌ల‌నాయ సాగ‌ర్ సిధిలావ‌స్తలో చేరుకున్న ఈ ప్రాజెక్ట్ ను జ‌పాన్ ప్ర‌పంచ బ్యాంక్ నిధుల‌తో అభివృద్ది చేస్తామ‌ని చెప్ప‌డం త‌ప్ప ఫ‌లితం మాత్రం కాన‌రావ‌డం లేద‌ని రైతు సంఘాల‌నేత‌లు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. మంత్రిగారు న‌లుగురు అయిదుగురుకి త‌ప్ప మ‌రెవ‌రికి అందుబాలులో ఉండ‌క‌పోవ‌డం, చంద్ర‌బాబు ఫిరాయింపు రాజ‌కీయాల కార‌ణంగా స్థానిక టీడీపీ నేత‌ల‌కు మంత్రి రంగారావు మ‌ధ్య పొస‌గ‌క పోవ‌డంతో నియోజ‌వ‌ర్గ అభివృద్ది ఆగిపోయింద‌ని బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. 
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సుజ‌య రంగారావు ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుండానే టీడీపీలో చేర‌డాన్ని వారి అనుచ‌రులు మెచ్చ‌వ‌చ్చేమో కాని సామాన్యులు మాత్రం మ‌న‌స్పూర్తిగా ఆహ్వానించ‌లేక‌పోతున్నారు. బొబ్బిలి రాజులు అంటే పౌరుషానికి ప్ర‌తీక‌ని మాట‌త‌ప్పర‌న్న గొప్ప గౌర‌వం నుంచి మా రాజుగారు కూడా అంద‌రిలాంటి మ‌నిషేన‌న్న స్థాయికి స‌జ‌య కృష్ణ రంగారావు సోద‌రులు దిగ‌జారుతున్నారని ప్ర‌జ‌లు భ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 
 
అయితే అమ‌రావ‌తి లేకుంటే విశాక ప‌ట్నానికి ప‌రిమితం అవుతున్నార‌ని చ‌ర్చ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో బ‌లంగానే ఉంది. అయితే అప్పుడ‌ప్పుడు బొబ్బిలికి వ‌చ్చినా కోట గోడ త‌లుపులు అన్యాయుల‌కు త‌ప్ప సామాన్యుల‌కు తెరుచుకోవ‌డం లేద‌నే చేదు నిజం ఇప్పుడు బొబ్బిలి రాజుల‌ను ప్ర‌జ‌ల‌కు దూరం చేస్తోంది. మాకు కోట‌లు కోట్లు ఉన్నాయ‌ని చెప్పి రంగారావు సోద‌రులు కేవ‌లం వాటిని కాపాడుకోవ‌టానాకి పార్టీ మారారు త‌ప్ప పేద‌ల కోసం కాద‌ని ఈ విష‌యాన్ని ప్ర‌జ‌లు ఎప్పుడో గ్ర‌హించార‌ని  విప‌క్ష‌నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.