ఫిరాయింపు ఎమ్మెల్యే బ‌రితెగింపు రాజ‌కీయం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-27 18:38:40

ఫిరాయింపు ఎమ్మెల్యే బ‌రితెగింపు రాజ‌కీయం

* ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ బ‌రి తెగింపు
* వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్ గా అధికార దుర్వినియోగం 
* కారు చౌక‌గా వ‌క్ఫ్ బోర్డ్ స్థ‌లాన్ని కాజేసే య‌త్నం
* జ‌లీల్ ఖాన్ పై మైనార్టీ సంఘాల ఆగ్ర‌హం
* ముడుపులు తీసుకుని స్థలం అప్ప‌గిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు
* ముస్లింల‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌ని మండిపాటు
* ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఫిర్యాదు చేసిన మైనార్టీ నాయ‌కుడు
 
విజ‌య‌వాడ కాలేశ్వ‌ర రావు మార్కెట్ స‌మీపంలోని వ‌క్ఫ్ బోర్డ్ కు చెందిన స్థ‌లం సుమారు వంద‌కు కోట్ల‌కు పైగానే ఉంటుంది. వ్యాపార కేంద్రం అయిన ఈ ప్రాంతంలో ఈ స్థ‌లాన్ని వాణిజ్య అవ‌స‌రాల‌కు వినియోగించుకునేందుకు గతంలోనే ఎంద‌రో వ్యాపారులు ప్ర‌య‌త్నించారు. వ‌క్ఫ్ బోర్డ్ ప‌రిధిలో ఈ స్థ‌లం ఉండ‌టంతో దీనిని ద‌క్కించు కునేందుకు గతంలో జ‌రిగిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. అయితే ఇప్పుడు ఇదే స్థ‌లంపై స్థానిక ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ క‌న్నుప‌డింది. ఆయ‌న వ‌క్ఫ్ బోర్డ్ చైర్మ‌న్ కావ‌డంతో దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే ఉద్దేశంతో జ‌లీల్ ఖాన్ ఈ స‌థ‌లాన్ని గుట్టు చ‌ప్పుడు కాకుండా త‌న‌కు స‌న్నిహితంగా ఓ వ్యాపార సంస్థ‌కు అప్ప‌గించే ప్ర‌య‌త్నం చేశారు.
 
త‌న‌కు బినామీగా ఈ వ్యాపార సంస్థ‌ను ముందుకు తీపుకువ‌చ్చార‌నే ఆరోప‌ణ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే ఇందుకోసం ఆ సంస్థ నుంచి ఏకంగా కోటీ రూపాయ‌ల‌కు పైగా ముడుపులు అందుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ స్థ‌లాన్ని వ‌స్త్రవ్యాపార‌ సంస్థ‌గా మార్చేందుకు జ‌లీల్ ఖాన్ ప్ర‌య‌త్నిస్తున్నారు. అడుగుకు 18 రూపాయ‌లు చొప్పున ఏకంగా 30 సంవ‌త్స‌రాలు లీజుకు ఇచ్చేందుకు నిర్ణ‌యించుకున్నార‌ట‌. 
 
అయితే ఇందుకోసం ఈ నెల ఆర‌వ తేదిన వ‌క్ఫ్ బోర్డు టెండ‌ర్ల‌ను పిలిచింది. కేవ‌లం మూడు సంస్థ‌లు మాత్ర‌మే ఈ టెండ‌ర్లును ధాఖ‌లు చేశాయి. ఈ స్థ‌లాన్నిద‌క్కించుకునే సంస్థ జ‌లీల్ త‌న‌కు స‌న్నిహితంగా ఉన్న మ‌రో రెండు సంస్థ‌ల‌తో టెండ‌ర్లు వేయించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ మూడు టెండ‌ర్ల‌ల‌లో ముందుగా జ‌లీల్ ఖాన్ ఆసిస్సులు ఉన్న సంస్థ‌కే టెండ‌ర్లు ద‌క్కేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. 
 
ఇక ఇదే స్థ‌లానికి సంబంధించి న్యాయ‌స్థానంలో వివాదం కూడా ఉంద‌ని అయితే దీనిని ప్రైవేట్ సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెట్ట‌డం చ‌ట్ట‌విరుద్దం అని కొంద‌రు చెబుతున్నారు. వంద‌కోట్ల‌కు విలువైన స్థ‌లాన్ని లీజుకు ఇచ్చే విష‌యంలో గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌ను నిర్వ‌హించ‌క‌పోవ‌డం పై అనేక అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. గతంలో కేఎల్ రావు ఎంపీగా ఉన్న స‌మ‌యంలో ఇదే మార్కెట్ ప‌క్క‌న ఉన్న వ‌క్ఫ్ బోర్డ్ స్థ‌లంలో కేవ‌లం 1200 గజాలు మాత్ర‌మే తీసుకుని  కేంద్ర ప్ర‌భుత్వ నిధుల‌తో సుమారు ఆరు అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించారు.
 
దీనిపై ప్ర‌తీ నెల‌కు ఐదు ల‌క్ష‌లకు పైగా ఆదాయం వ‌స్తోంది. ఈ స్థ‌లంలో నేష‌న‌ల్ వ‌క్ఫ్ కార్పోరేష‌న్ ద్వారా బ‌హూళ‌ అంత‌స్థు భ‌వ‌నాన్ని నిర్మిస్తే ఉపాధి కోసం పేద ముస్లింల‌కు త‌క్కువ రేటుకు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని మైనార్టీ సంఘాలు అంటున్నాయి. ఇక మ‌రోవైపు తెలుగుదేశం పార్టీకే చెందిన మైనార్టీ నాయ‌కులు ఈ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.