ఫిరాయింపులు వెన‌క‌డుగు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-06 01:06:20

ఫిరాయింపులు వెన‌క‌డుగు ?

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ విజ‌యం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం అంద‌రికి తెలిసిందే.... ప్ర‌జా సంక్షేమం కోసం ఆలోచిస్తూ సుప‌రిపాల‌న చేయాల్సిన బాధ్య‌త అధికార పార్టీది. అలా చేయ‌కుండా  ప్ర‌తిప‌క్ష పార్టీని బ‌లీహీన ప‌ర‌చ‌డం పై దృష్టి  సారించింది టీడీపీ ప్ర‌భుత్వం... వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేందుకు వ్యూహాలు ర‌చిస్తూ ఫిరాయింపుల‌ను ప్రోత్సహిస్తోంది అధికార టీడీపీ.
 
అందులో భాగంగానే ప్ర‌తిప‌క్ష వైయ‌స్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన‌ 23మంది శాస‌న స‌భ్యుల‌ను ప్రధానంగా పదవులు ఆశచూపించి, కేసులతో భయపెట్టి, కాంట్రాక్టులంటూ ప్ర‌లోభ‌పెట్టి అధికార పార్టీ వీరిని తమలో కలిపేసుకుంది. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేసి అధికార పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు అక్క‌డ పార్టీలో కొన‌సాగ‌లేక‌పోతున్నారు దీనికి ప‌లుకార‌ణాలు కూడా తెలుస్తున్నాయి ముఖ్యంగా తెలుగుదేశంలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కులు అక్క‌డ సెగ్మెంట్ ఇంచార్జ్ లు వైసీపీ చేతిలో ఓట‌మి పాలైన నాయ‌కుల‌తో వీరికి  వ‌ర్గ పోరు శిఖ‌రాల‌కు తాకుతోంది.
 
దీంతో తెలుగుదేశంలోకి చేరి తప్పు చేశాము అనే ఆలోచ‌న‌కు ఫైన‌ల్ గా వ‌చ్చారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే ఇటు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో వైసీపీకి వ‌చ్చే ఓ రాజ్య‌స‌భ సీటుకు కూడా ఎర్త్ పెట్టాలి అని ఆలోచిస్తోంది తెలుగుదేశం.. అందుకే రాజ్య‌స‌భ‌కు మూడ‌వ అభ్య‌ర్దిని నిల‌బెట్టాలి అని చూస్తోంది. దాని కోసం ఏకంగా ఎక్క‌డా లేన‌టువంటి ఓ దుష్ట ఆలోచ‌న‌కు వ‌చ్చింది అని వైసీపీ మండిప‌డుతోంది.. కాకినాడ వైసీపీ పార్ల‌మెంట్ అభ్య‌ర్దిగా పోటీ చేసిన చ‌ల‌మ‌శెట్టి సునీల్ ను పార్టీలోకి తీసుకుని రాజ్య‌స‌భ సీటు ఇవ్వాలి అని మంత‌నాలు జ‌రుపుతోంది తెలుగుదేశం పార్టీ.
 
ఈ వ‌ర్గ పోరుతో, వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే ప‌రిస్దితి లేక‌పోవ‌డం, అలాగే ఫిరాయింపు అనే స్టాంప్ ప‌డ‌టంతో రాజ‌కీయాల్లో త‌మ ఫ్యూచ‌ర్ ఏమిటా అని డైలామాలో ఉన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు.... అందుకే ఏపీలో ఉన్న ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్ధితుల కార‌ణంతో  వైసీపీలో చేర‌డానికి మ‌ళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నారు.. అయితే ఈ జాబితాలో కొడుమూరు ఎమ్మెల్యే మ‌ణిగాంధీ ముందు వ‌రుస‌లో ఉన్నారు అని తెలుస్తోంది. ఇక ద‌ళితుల‌కు కూడా తెలుగుదేశం ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తుందో నేరుగా మాజీ మంత్రి తాజాగా వెల్ల‌డించారు..
 
మ‌ళ్లీ వారిపై అదే సామాజిక‌వర్గం నాయ‌కుల చేత విమ‌ర్శ‌లు చేయ‌డం ఇవ‌న్ని ఆ సామాజిక వర్గానికి మంటపుట్టించాయి.. అగ్ర‌వ‌ర్ణాల పెత్త‌నం మా సెగ్మెంట్లో ఏమిట‌ని ప‌ద‌వి మాది పెత్త‌నం వారిదా అనే  విష‌యాన్నితెలియ‌చేశారు... ముఖ్యంగా ఫిరాయింపులు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు అని, ఏదో ఓ రోజు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వెళ్లి పార్టీలో చేర‌డం ఖాయం అంటున్నారు వైసీపీ నాయ‌కులు...  ఒక‌వేళ తాము టీడీపీలో కొన‌సాగితే సొంత కొడుకు ముద్దు అద్దె కొడుకు వ‌ద్దు అన్న చందంగా మాకు సీట్లు కూడా బాబు ఇవ్వ‌రు అనేది తాజాగా స్ప‌ష్టమ‌వుతోంది అంటున్నారు నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.