వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-18 13:20:58

వైసీపీలోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు

2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అత్య‌ధిక మెజారీటీతో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన విష‌యం తెలిసిందే... తెలుగుదేశం నాయ‌కుల ఇచ్చే ప్ర‌లోభాల‌కే  వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు అని వైసీపీ నిరంతరం విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటుంది....అయితే పార్టీలోకి ఫిరాయించిన రెండు సంవ‌త్స‌రాల‌కే కొంత మంది ఎమ్మెల్యేలు చంద్ర‌బాబుపై త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. ఇది ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న అంశం.
 
అయితే కొద్ది రోజుల‌ క్రితం కొడుమూరు ఎమ్మెల్యే మణిగాందీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు... తాను డబ్బు కోసమే వైసీపీ నుంచి తెలుగు దేశం పార్టీలోకి మారానని, అలా మారి తన రాజ‌కీయ‌ భవిష్యత్ ను దెబ్బతీసుకున్నానని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించిన‌ సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే.
 
ఇక తాజాగా ఇదే బాట‌లోనే ప‌దిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న‌ట్లు ఒక జాతీయ మీడియా క‌థ‌నంలో పేర్కొంది... గ‌తంలో తాము పార్టీ మారి చాలా త‌ప్పుచేశామ‌ని, అయితే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇస్తే తిరిగి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు జాతీయ మీడియా పేర్కొంది.. దీంతో పాటు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున జ‌గ‌న్ అసెంబ్లీ సీటు కేటాయిస్తే తాము తిరిగి వైసీపీలోకి వ‌స్తామ‌ని చెబుతున్నార‌ట ఫిరాయింపు ఎమ్మెల్యేలు.
 
అయితే  ఈ విష‌యంపై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఒప్పుకోవ‌డంలేద‌ట‌... సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున టికెట్ ఆశించ‌కుండా పార్టీలో చేరితే ఒప్పుకోవచ్చని చెబుతున్నారట‌... మ‌రి ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ అధినేత తీసుకున్న నిర్ణ‌యంపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి... మొత్తానికి వైసీపీ నుంచి టీడీపీ లోకి ఫిరాయించిన  ఎమ్మెల్యేల ప‌రిస్థితి ప్ర‌స్తుతం కుక్క‌లు చింపిన విస్త‌రాకుల్లా మారుతోంద‌ని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.