ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్ర‌చారం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-06-01 18:37:35

ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్ర‌చారం

2014 ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంద‌రూ త‌న‌వాళ్లే అని భావించి పార్టీకి న‌మ్మ‌కంగా పని చేస్తార‌నే ఉద్దేశ్యంతో జ‌గ‌న్ అభ్య‌ర్థులకు ఆయా నియోజ‌కవ‌ర్గాల నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేయించారు. జ‌గ‌న్ అండ‌, వైఎస్ ఫేమ్ తో అత్య‌ధిక మెజారిటీతో గెలిచిన వీరు పార్టీ అధినేత‌కు వెన్నుపోటు పొడిచి అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో సుమారు 23 మందివైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ కండువా క‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. 
 
అయితే వారు పార్టీ ఫిరాయించిన‌ప్ప‌టి నుంచి టీడీపీ అధిష్టానం ద‌గ్గ‌ర మార్కులు కొట్టాల‌నే ఉద్దేశ్యంతో ఆ 23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై లేని పోని నింద‌లు వేస్తున్నారు. ఇందులో ఒక‌రు ఇద్ద‌రు మిన‌హా ఇస్తే మిగిలిన వారంద‌రూ మార్కులు కొట్టేయాల‌నే నేప‌థ్యంతో జ‌గ‌న్ పై లేనిపోని రూమ‌ర్స్ క్రియేట్ చేస్తూ అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారు. ఆయ‌న‌ గురించి ఏమ‌ని ప్ర‌చారం చేస్తున్నారంటే.. పార్టీ నాయ‌కుల స‌మావేశం జ‌రిగిన‌ప్పుడు జ‌గ‌న్ ఒక్క‌రే మాట్లాడుతార‌ని ఆయ‌న మాట్లాడిన త‌ర్వాత  సొంతంగా నిర్ణ‌యం తీసుకుంటారట‌? జ‌గ‌న్ పెద్ద‌వారికి గౌర‌వం ఇవ్వ‌రని? అలాగే ప్ర‌తీ ఒక్క‌రూ సార్ అని పిల‌వాలి? ఇలాంటి అబద్దాల‌తో కామెంట్లు చేస్తున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. 
 
అయితే వారి మాట‌ల‌ను ప్ర‌జ‌లు ఒక్క‌రు కూడా న‌మ్మ‌డంలేదు. వైఎస్ కుటుంబం ఎలాంటిదో, జ‌గ‌న్ ఎలాంటి వారో ప్ర‌జ‌లకు పూర్తిగా తెలుసు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలు, జ‌గ‌న్ పై ఎన్ని వ్యాఖ్య‌లు చేసినా వాటిని ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తారు. పైగా వారికే తిరిగి కౌంట‌ర్లు వేస్తున్నారు. ఎందుకంటే జ‌గ‌న్ చిన్న‌వారిని త‌మ్ముడూ అని, పెద్ద వారిని అయితే అన్నా అని ఎంతో ఆప్యాయంగా ప‌లుక‌రిస్తారు. అలాగే మ‌హిళ‌ల‌ను పేరుతో పిలువ‌కుండా అమ్మా అని పిలుస్తారు. ఇలాంటి వ్య‌క్తిపై ఎవ‌రెన్ని బుర‌ద‌చ‌ల్లినా ప్ర‌జ‌లు వీటిని తిర‌స్క‌రిస్తారు. జ‌గ‌న్ న‌మ్మితే ఎలా చూస్తారో ప్ర‌జ‌ల‌కు బాగా తెలుసు.
 
మ‌రి ఇంత ప్ర‌జాభిమానం ఉన్న జ‌గ‌న్  పై అభాండాలు వేయ‌డం వ‌ల్ల వారు మ‌రింత ప్ర‌జాద‌ర‌ణ వ‌స్తుందని భావించి జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే వారి విమ‌ర్శ‌లుకు జ‌గ‌న్ కంటే ప్ర‌జ‌లే వారిపై ఎక్కువగా సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని సెటైర్లు వేస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు అయితే  తెలుగుదేశం స్క్రిప్ట్ ను బాగానే చ‌దువుతున్నారు ఫిరాయింపులు అనేది మ‌రోసారి తేలిపోయింది అని వైసీపీ అభిమానులు చెబుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.