వారిని మా పార్టీలో చేర్చుకోము

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-30 16:17:34

వారిని మా పార్టీలో చేర్చుకోము

ప్రతిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ప్ర‌త్యేక హోదా కోసం అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే... ఇక ఇప్ప‌టికే వైసీపీ ఎంపీలు త‌మ ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా ఢిల్లీలోని ఎపీ భ‌వ‌న్ లో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి నిరాహార దీక్ష చేసిన సంగ‌తి తెలిసిందే...
 
ఇక తాజ‌గా సోమవారం విశాఖపట్నంలో  వంచన వ్యతిరేక దీక్ష పేరుతో వైసీపీ నాయ‌కులు  బ‌హిరంగ స‌భ‌ను చేప‌ట్టారు.... ఈ వంచన వ్యతిరేక దీక్ష సభాప్రాంగణం వద్ద వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌త్యేక హోదాకోసం మొద‌టి నుంచి వైసీపీ పోరాటం చేస్తుంద‌ని, కానీ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు  ప్ర‌జ‌ల‌ను త‌ప్పు దారి మ‌ల్లించి ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ప్ర‌త్యేక ప్యాకేజికి  తెర‌లేపార‌ని విజ‌య‌సాయి రెడ్డి మండిప‌డ్డారు.... 
 
అయితే ఇప్ప‌టికిప్పుడు చంద్ర‌బాబు ప్లేటు ఫిరాయించి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలంటూ ద‌ర్మ దీక్ష‌పేరుతో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుత‌న్నార‌ని ఆరోపించారు...అయితే  ఆయ‌న అవినీతి అక్ర‌మాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని 2019 ఎన్నిక‌ల్లో టీడీపీకి త‌గిన బుద్ది చెబుతారాని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు.
 
ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక హోదా కోసం జ‌గ‌న్ పోరాడుతున్న తీరును చూసి టీడీపీ ఎమ్మెల్యేల‌తో పాటు ఇతర పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు వైసీపీలోకి చేరేందుకు త‌న‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని  స్ప‌ష్టం చేశారు.2014 ఎన్నిక‌ల్లో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున అత్య‌ధిక‌ మెజారిటీతో గెలిచి అధికార తెలుగుదేశం పార్టీ ప్ర‌లోభాల‌కు ఆశ‌ప‌డి 23 మంది వైసీపీ నాయ‌కులు టీడీపీలోకి ఫిరాయించిన సంగ‌తి తెలిసందే... అయితే ప్ర‌స్తుత రాజ‌కీయాల దృష్ట్యా తిరిగి వారు సొంత‌గూటికి చేరెందుకు సిద్దంగా ఉన్నార‌ని విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు... అయితే పార్టీ ఫిరాయించిన వారిని తిరిగి వైసీపీలోకి తీసుకునే ప్రసక్తే లేదని స్ప‌ష్టం చేశారు.
 
అలాగే మొన్న కేంద్ర‌మంత్రి వైసీపీని బీజేపీ ఆహ్వానించ‌డంపై టీడీపీ నాయ‌కులు త‌మ‌పై బుర‌ద జ‌ల్లుతున్నార‌ని మండిప‌డ్డారు...అయితే  వైసీపీతో పాటు  టీడీపీని కూడా తిరిగి బీజేపీలోకి రావాల్సిందిగా కేంద్ర‌మంత్రి పిలిచారని గుర్తు చేశారు విజ‌య‌సాయి రెడ్డి... అయితే తాము ఎవ‌రైతే రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టిస్తుందో వారికే మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.