వీరిద్ద‌రి పాల‌న‌కు ఇదే తేడా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ys rajasekhar reddy and chandrababu naidu
Updated:  2018-08-29 04:55:22

వీరిద్ద‌రి పాల‌న‌కు ఇదే తేడా

ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప‌రిపాల‌న‌కు ప్ర‌స్తుత‌ ఏపీ మఖ్య‌మంత్రి ప‌రిపాల‌న‌కు ఎంత‌ వ్య‌త్యాసం ఉందో మ‌నంద‌రికి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్ద‌రి ప‌రిపాల‌న‌పై ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ మీడియా ద్వారా మ‌రోసారి గుర్తు చేశారు. ఈ సంర్భంగా ఆయ‌న  మాట్లాడుతూ, వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్ర‌జా పాల‌న సాగేద‌ని, ఆయ‌న పరిపాల‌నలో ప్ర‌జ‌లంద‌రు సుఖ సంతోషాలో ఉండే వార‌ని బొత్స అన్నారు. 
 
అయితే ప్ర‌స్తుత ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌లో ప్ర‌జా ధ‌నాన్ని అక్ర‌మంగా దోచుకోవ‌డం దాచుకోవ‌డం లాంటివి జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. టీడీపీ అధికారం ఉండి ప్ర‌జా ప‌రిపాల‌న చేయ‌కున్నారాని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రం జిల్లాలో డెంగ్యూ, మ‌లేరియా వంటి విష‌ జ్వరాల‌తో, ప్ర‌జ‌లు చ‌చ్చిపోతున్నా టీడీపీ నాయ‌కులు ప‌ట్టించుకోకున్నార‌ని బొత్సస‌త్య‌నారాణ మండిప‌డ్డారు.
 
అంతేకాదు ఇదే జిల్లాలో ఓట్లు వేయంచుకుని ఎమ్మెల్యే అయిన టీడీపీ నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌పై క‌నిక‌రం చూప‌కున్నార‌ని ఆయ‌న ఆరో పించారు. అయితే రానున్న ప్ర‌భుత్వ నాయ‌కులు ఈ జిల్లాలోని విష‌జ్వ‌రాల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.