జగన్ పాదయాత్ర ప్రభావం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-24 15:25:53

జగన్ పాదయాత్ర ప్రభావం

వనజాక్షిపై దాడి, ఇసుక మాఫియా, భూ దందా, చేపల చెరువు వ్యవహారంలో పోలీసులను తిట్టడం ఇలాంటి ఎన్నో వ్యవహారాలతో  రాష్ట్ర ప్రజల చేత రౌడీగా ముద్ర వేయించుకున్నారు చింతమనేని ప్రభాకర్. ఎన్ని తప్పులు చేసినా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండడంతో టీడీపీ అతనికి వంతపాడుతుంది. దింతో చింతమనేని అడ్డాగా దెందులూరు మారిపోయింది అంటారు అక్కడ నాయకులు...
 
చింతమనేని అడ్డాలో ఇటీవలే జగన్ పాదయాత్ర ముగించుకున్నారు...జగన్ చేసిన పాదయాత్రతో చింతమనేని అడ్డాలో వైసీపీ జెండా ఎగురుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు... ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి దెందులూరులో అడుగుపెట్టగానే కార్యకర్తలు, అభిమానులు, టీడీపీ వ్యతిరేకులు, చింతమనేని దౌర్జన్యాలతో విసిగిపోయిన ప్రజలతో పాదయాత్ర ప్రాంతం జనసంద్రమైంది... ఈ జనసంద్రోహాన్ని చూసి చింతమనేనికి దడ పుట్టింది...
 
చర్చి ఆవిష్కరించడానికి చింతమనేని తాడేపల్లిగూడెంకి వెళ్లారు...ఆ ప్రాంతంలోనే జగన్ పాదయాత్ర జరుగుతుండడంతో, పాదయత్రకి  ప్రజలు వెల్లువలా రావడంతో, ఆ జనంలో చిక్కుకుపోయారు చింతమనేని...ఈ ఘటన ఒక్కటి చాలు చింతమనేని ఓడిపోవడానికి అంటున్నారు వైసీపీ నేతలు... 
 
ఈ నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర యొక్క ప్రభావం బలంగా పడింది...మరో వైపు చింతమనేనికి వ్యతిరేకంగా గాలి వీస్తుంది, దానికి తోడు దెందులూరు వైసీపీ ఇంఛార్జిగా కొటారు అబ్బయ్య చౌదరి నిత్యం ప్రజల్లో ఉంటూ, చింతమనేని చేస్తున్న అరాచకాలపై పోరాడుతున్నారు.
 
చింతమనేని చేస్తున్న రాక్షస‌పాలన నుండి దెందులూరు ప్రజలకు విముక్తిని ప్రసాదించడానికి యువనేత కొటారు అబ్బయ్య చౌదరి స్దిద్దంగా ఉన్నారని దెందులూరు వైసీపీ నేతలు అంటున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే దెందులూరులో వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.