దేవినేనికి మతి భ్రమించిందా

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

devineni
Updated:  2018-04-08 17:45:43

దేవినేనికి మతి భ్రమించిందా

నాలుగేళ్లు పాటు ప్రత్యేక హోదా ఉసెత్తకుండా, ప్రత్యేక హోదా పేరెత్తితే జైల్లో పెట్టిస్తానన్న టీడీపీ ఇప్పుడు మాట మార్చి ఎన్నికలు దగ్గరపడటంతో ప్రత్యేక హోదా కావాలని, మేము కూడా పోరాడుతున్నాం అంటున్నారు ...టీడీపీ నాయకులు అనుసరిస్తున్న తీరుపై ప్రతిపక్షం, వామపక్షాలు, మిత్రపక్షమైన జనసేన కూడా మండిపడుతుంది. ప్రజలు కూడా చంద్రబాబు ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో ఊసరవెల్లి , యూ టర్న్ అంకుల్, రెండు నాలుకలా ధోరణి అంటూ కొత్త పేర్లు పెడుతున్నారు చంద్రబాబుకి..
 
ప్రత్యేక హోదాపై దేవినేని ఉమ మాట్లాడిన తీరుపై వైసీపీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం మేము చిత్తశుద్దిగా పోరాటం చేస్తున్నాం అని చెప్పిన దేవినేని ఉమకి మల్లాది విష్ణు కౌంటర్ ఇచ్చారు...దేవినేని ఉమకి మతి భ్రమించింది, అందుకే నాలుగేళ్లు పాటు ప్రత్యేక హోదా పేరెత్తకుండా ఇప్పుడు పోరాడుతున్నాం అంటున్నారు..
 
వీళ్లకు రాష్ట్రా ప్రయోజనాలపైనా ఏ మాత్రం చిత్తశుద్ధి వున్నా వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసేవాళ్ళు... ఆంధ్రాలో ఏమో బీజేపీ నుండి బయటకు వచ్చాము అంటారు, ఢిల్లీకి వెళ్తే మాత్రం బీజేపీతో కొనసాగుతున్నాము అంటారు. ఇక్కడేమో  హోదాకోసం అఖిలపక్షం అంటారు..ఢిల్లీకి వెళ్లి హోదా హుసేత్తకుండా కేసుల కోసం చీకటి రాజకీయాలు చేస్తారు. ఇలా టీడీపీ నాయకులు రోజుకో మాట మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసారు మల్లాది విష్ణు...

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.