ప‌వ‌న్ కు ద‌మ్ముంటే అక్క‌డ స‌భ పెట్టాలి

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

pawan kalyan and devineni uma
Updated:  2018-10-16 10:31:36

ప‌వ‌న్ కు ద‌మ్ముంటే అక్క‌డ స‌భ పెట్టాలి

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ధ‌వ‌ళేశ్వ‌రంలో నిర్వ‌హించిన క‌వాతును ఖండిస్తూ ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే ఇదే క్ర‌మంలో భారీ నీటిపారుద‌లశాఖ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర రావు జ‌న‌సేన క‌వాతు పై స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ విజ్ఞ‌తితో వ్య‌వ‌హ‌రించాల‌ని డిమాండ్ చేశారు.
 
డ్యామ్ ల‌పై బ‌ల ప్ర‌ద‌ర్శ‌న త‌గ‌ద‌ని జ‌న‌సైనికుల‌కు ఉమా హెచ్చ‌రించారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సందుల్లో గొందుల్లో స‌భ‌ను ఏర్పాటు చేసి ఈ స‌భ‌కు జ‌నాలు ఎక్కువ మంది వ‌చ్చిన‌ట్లుగా డ్రోన్ ల ద్వారా చిత్రించాడ‌ని ఉమా త‌ప్పుబ‌ట్టారు. అయితే  ప‌వ‌న్ డ్యామ్ ల‌పై స‌భ‌ల‌ను ఏర్పాటు చేయ‌డం కాద‌ని ద‌మ్మంటే జాతీయ ర‌హదారిపై  ఇలాంటి స‌భ‌ల‌ను ఏర్పాటు చెయ్యాల‌ని స‌వాల్ విసిరారు. మొన్న‌టివ‌ర‌కు ఉద్దానం ఉద్దానం అని క‌ల‌వ‌రించిన ప‌వ‌న్ ఇప్పుడు ఆ ప‌దం ఎక్క‌డికి పోయింద‌ని ఉమా మ‌హేశ్వ‌రరావు మండిప‌డ్డారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు