షాకిచ్చిన డీజీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-17 16:20:06

షాకిచ్చిన డీజీపీ

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. గత 10 రోజుల్లోనే సుమారు నాలుగైదు అత్యాచారాలు అది రాజధానికి అతి దగ్గర్లోనే జరిగాయి.. రాజధాని అమరావతి దగ్గరే ఇలాంటి పరిస్థితి ఉంటె మిగతా చోట్ల ఎలా ఉంటుందో అని ప్రజలు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు.. అత్యాచారం జరిగే కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్న ఏమి చేయలేకపోయారని, పోలీసుల పైన కూడా విమర్శలు చేస్తున్నారు...
 
ఈ అత్యాచారాలను ఎలాగైనా అడ్డుకట్టవేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో సమావేశం నిర్వహించారు..ఈ సమావేశంలో చంద్రబాబు పోలీసుల నిర్లక్ష్యం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి. జరుగుతున్నా అత్యాచారాలకు పోలీసులే బాధ్యత వహించాలని డీజీపీ మాలకొండయ్య పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఓ పత్రిక కథనాల్లో వచ్చింది.
 
ఈ వ్యాఖ్యలపైనా డీజీపీ మాలకొండయ్య, చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారని పత్రిక కథనాల్లో వచ్చింది. టీడీపీ కార్యకర్తలే ఈ దారుణాలకు పాల్పడుతున్నారని, టీడీపీ నాయకుల ఒత్తిడి వల్లే ఏమి చేయలేకపోతున్నామని డీజీపీ మాలకొండయ్య  చంద్రబాబుకు చెప్పారట.టీడీపీ నాయకులు మా మీద ఒత్తిడి చేయకుండా స్వేచ్ఛగా మమ్మ‌ల్ని వదిలేస్తే ఇలాంటి దారుణాలు జరగకుండా చూసుకుంటామని డీజీపీ మాలకొండయ్య చంద్రబాబుకు చెప్పడంతో, ఆ విషయంలో చంద్రబాబు ఏమి మాట్లాడకుండా టాపిక్ డైవర్ట్ చేశారని ప్రముఖ పత్రికలో కధనాలు వచ్చాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.