సంచ‌ల‌నం 15న బాబు కోర్టుకు రావాల్సిందే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

babu
Updated:  2018-09-21 01:14:26

సంచ‌ల‌నం 15న బాబు కోర్టుకు రావాల్సిందే

బాబ్లీ కేసులో ధ‌ర్మాబాద్ కోర్టులో చంద్ర‌బాబు నాయుడుకు చుక్కెదురైంది. తాజాగా నాన్ బెయిల‌బుల్ వారెంట్ ర‌ద్దు కోరుతూ చంద్ర‌బాబు త‌ర‌పు న్యాయ‌వాదులు దాఖ‌లు చేసిన రీకాల్ పిటీష‌న్ నేడు వాద‌న‌లు పూర్తి చేసిన న్యాయ‌స్థానం కొద్ది రోజుల క్రితం నోటీసులు అందుకున్న అంద‌రూ కోర్టుకు హాజ‌రు కావాల్సిందేన‌ని తీర్పునిచ్చింది. 
 
అయితే ఈ రోజు హాజ‌రైన ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. చ‌ట్టం ముందు అంద‌రు స‌మాన‌మే అన్న కోర్టు ఎవ్వ‌రికీ స్పెష‌ల్ ట్రీట్ మెంట్ ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అక్టోబ‌ర్ 15న అంద‌రూ కోర్టుకు హాజ‌రు కావాల్సిందేన‌ని తేల్చి చెప్పింది. దీంతో చంద్ర‌బాబు నాయుడు కోర్టుకు హాజ‌రు కాక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. 
 
బాబ్లీ కేసులో చంద్ర‌బాబుతో పాటు 16 మంది నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ధ‌ర్మ‌బాద్ కోర్టు.  అక్టోబ‌ర్ 15న అంద‌రూ కోర్టుకు హాజ‌రు కావాల‌ని అలాగే ఈ రోజు కరీంన‌గ‌ర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్, చెవ‌ల్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ ర‌త్నం, రాజేంద్ర‌న‌గ‌ర్ తాజా మాజీ ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్ ల‌కు బెయిల్ మంజూరు చేసింది ధ‌ర్మాస‌నం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.