అమ్మ ఒప్పుకుంటే ఓకే

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-01-28 03:43:22

అమ్మ ఒప్పుకుంటే ఓకే

బాహుబ‌లి సినిమాతో దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన హీరో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ కొంత గ్యాప్ తీసుకుని, ప్ర‌స్తుతం సాహో సినిమా షూటింగ్‌లో బిజి అయిపొయారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ న‌టిస్తోంది. సాహో సినిమా త‌రువాత జిల్ సినిమా దర్శకుడు రాధ కృష్ణ‌తో సినిమా చేయ‌బోతున్నాడు హీరో ప్ర‌భాస్.

ఈ చిత్రంలో బాలీవుడ్ ప్ర‌ముఖ హీరోయిన్ దీపికా పదుకొణె న‌టిస్తుంద‌న్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే పద్మావత్ విడుద‌లై విజ‌యం సాధించిన‌ త‌రువాత దీపిక‌ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంది. దీంతో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్‌ను సంప్ర‌దించాడ‌ట ద‌ర్శ‌కుడు. ఈ అమ్మ‌డు సైఫ్ మొద‌టి భార్య అమృత్‌సింగ్ సంతానం.

ప్ర‌భాస్ పేరు చెప్ప‌గానే స్క్రిప్ట్ విన్న సారా అలీఖాన్ బావుంద‌ని.....అయితే అమ్మ అనుమ‌తి తీసుకుని ఏ విష‌యం చెబుతాన‌ని ఈ అమ్మ‌డు తెలిపింద‌ట‌. సారా స‌మాధానం కోసం ద‌ర్శ‌కుడు రాధ కృష్ణ వేచి చూస్తున్న‌ట్లు తెలుస్తొంది. అమ్మ‌డు ఓకే అంటే త్వ‌ర‌లో సారాఅలీఖాన్‌ను ప్ర‌భాస్ స‌ర‌స‌న మ‌నం చూడ‌వ‌చ్చు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.