ప్ర‌ధాని మోదీకి ద‌ర్శ‌కుడు కొర‌టాల ట్వీట్‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-08 05:16:44

ప్ర‌ధాని మోదీకి ద‌ర్శ‌కుడు కొర‌టాల ట్వీట్‌

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ప‌ట్ల కేంద్రం ప్ర‌వ‌ర్తిస్తున్న తీరును దేశంలో ఉన్న అన్ని వ‌ర్గాల‌వారు ప్ర‌శ్నిస్తున్నారు. అయితే రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన స‌మ‌యంలో ఏపీకి విభ‌జ‌న చ‌ట్టంలో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు ఆ హామీలు నెర‌వేరుస్తామ‌ని ప్ర‌క‌టించారు.. అలాగే ఏపీకి ప్ర‌త్యేక హూదా ఇస్తాము అని అప్పుడు స‌ర్కారు అపోజిష‌న్ తెలియ‌చేసింది పోటా పోటీగా స‌భ‌లో మాట్లాడారు.. చివ‌ర‌కు ఇప్పుడు ఎటువంటి స్పందన లేదు క‌మ‌లం పార్టీనుంచి.
 
గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ త‌ర‌పున ప్ర‌ధాని అభ్య‌ర్దిగా ప్రచార కార్య‌క్ర‌మంలో భాగంగా న‌రేంద్ర మోదీ తిరుమ‌ల వెంక‌న్న సాక్షిగా ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని తెలియ‌చేశారు.. విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాలు అమ‌లు చేస్తామ‌ని హ‌మీ ఇచ్చారు. చివ‌ర‌కు పంగ‌నామాలు పెట్టారు.
 
అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి అవుతున్నా హ‌మీల‌ను అమ‌లు చేయ‌డంలో ఘోరంగా విఫ‌లం అయింది. తాజాగా ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించ‌డం సాధ్యంకాదంటూ కేంద్రం చెప్పిన విష‌యంపై ద‌ర్శ‌కుడు కొరటాల శివ స్పందించారు.   
 
ఏపీకి మోదీ ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుచేసి మోదీని మనిషిగా మారుద్దాం. తెలుగు రాష్ట్రాలు ఇండియాలో ఉన్నాయని మీరు నిజంగా భావిస్తున్నారా సార్‌ అంటూ కొరటాల ట్విట్టర్‌లో తెలిపారు. అయితే సామాజిక సమస్యలపై సినిమాలు తీసి హిట్ కొట్టడంలో కొరటాల శివ నైజం డిఫ‌రెంట్ గా ఉంటుంది.... మిర్చి మినహ  ఆయ‌న  దర్శకత్వం వహించిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్‌లలో సామాజిక సమస్యలను చూపించారు కొరటాల శివ.... ప్ర‌జ‌లు ప‌డుతున్న బాధ‌లు సొసైటీలో ఉన్న స‌మ‌స్య‌లు తెర‌కెక్కించ‌డంలో కొర‌టాల స్టైల్ వేరు ఆయ‌న రూటే వేరు అంటారు అభిమానులు.
 
ఇక తాజాగా ప్రిన్స్ మ‌హేష్ తో కూడా భ‌ర‌త్ అను నేను సినిమా తీశారు...ఈ సినిమాలో మ‌హేష్ సీఎంగా న‌టిస్తున్నారు అయితే ఇందులో ఎటువంటి కొత్త ద‌నం చూపిస్తారో చూడాలి అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.