వ‌ర్మ లేఖ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

rgv tweet
Updated:  2018-04-20 04:11:35

వ‌ర్మ లేఖ

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్మ మ‌ధ్య ట్వీట్లు యుద్దం కొన‌సాగుతోంది... ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న పై మీడియా అధినేత‌లపై ప‌లు ట్వీట్లు పెట్టారు.. అయితే ఈ విష‌యం పై క్లియ‌ర్ గా వ‌ర్మట్వీట‌ర్ ద్వారా  ఓ లేఖ రాశారు... ట్విట్ల‌ర్ లో ఓసారి ఆ లేఖ వివ‌రాలు చూడండి.
 
నేను పవన్ కళ్యాణ్ గారిని నెగటివ్  గా కామెంట్ చెయ్యనని మా మదర్ మీద ఒట్టేసాను..కానీ ఆ  తర్వాత ఆయన పెట్టిన ట్వీట్ల మూలాన ఇక్కడ నేను నెగటివ్  గా కాకుండా ,లాజికల్ గా సమాధానాలు చెప్పాల్సిన అవసరం  వచ్చింది.
 
పవన్ కళ్యాణ్ CBNని ఉద్దేశించి 
“మీ ప్రభుత్వం రావటానికి అండగా నిలబడినందుకు ప్రతిఫలంగా మీ కొడుకు అతని స్నేహితులు  ఆధ్వర్యంలో 6 నెలలుగా మీ మీడియా సంస్థాలైన TV9  ABN ANDHRA JYOTHI ద్వారా నా  మీద అత్యాచారం జరుపుతూ వచ్చారు ..దాంట్లో భాగంగానే..10 కోట్లు  ఖర్చు పెట్టి నాకు   సంబంధంలేని విషయాల్లోకి నన్ను లాగి నాకు జన్మనిచ్చిన తల్లిని నడి రోడ్డులో అసభ్యంగా బూతు  తిట్టించి దానిని పదే పదే ప్రసారం చేసి డిబేట్లు పెట్టి దానిని మీ పార్టీ వ్యక్తులు సర్క్యూలేషన్లో  పెట్టారు..Ram gopal Varma,Tv 9 owner srini raju ,Ravi Prakash ,Lokesh Naidu ,అతని  ఫ్రెండ్ Rajesh kilaru కలిసి చేయిస్తున్నారని మీకు తెలియదంటే నన్ను నమ్మమంటారా
 
RGV: పవన్ కళ్యాణ్ గారు,నేను విశ్వ ప్రసిద్ధ రచయిత ఆగతా క్రిస్టీ నవలల్లో కూడా ఇంత క్లిష్టమైన  కాన్స్పిరసీ థియరీ చదవలేదు  ..ఇప్పుడు  మీరు అర్జెంటుగా పెట్టిన ఈ మీటింగ్ CBN స్పెషల్ స్టేటస్ దీక్ష నుంచి డైవర్ట్ చెయ్యడానికి భరత్ అనే నేను కలెక్షన్స్ తగ్గించడానికని నేనూ అనగలను కానీ  అనను.  మీడియాలో మీటింగ్లు  బదులు పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని శ్రీరెడ్డి కి సలహా ఇఛ్చిన మీరు అదే పని మీరెందుకు చేస్తున్నట్టు ? అదలా ఉంచితే, అసలు ఏ.పి స్పెషల్ స్టేటస్ కంటే లీగలైజేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అనే టాపిక్ ముఖ్యమయ్యిందా అని మీరు అడిగినప్పుడు, ఒక పక్కన చంద్రబాబుగారు స్పెషల్ స్టేటస్ కోసం దీక్ష చేస్తుంటే మీరు సరిగ్గా ఇదే రోజు చేస్తున్న దీని మాటేమిటి? ఏపీ స్పెషల్ స్టేటస్ కంటే మీకు ఎవరో ఆఫ్ట్రాల్  వ్యక్తి  తిట్టారన్న విషయమే మీకు జాతీయ సమస్యా? మీరు చెప్పిన వివిధ పేర్లు వేరే విషయాల్లోఒక మూకుమ్ముడి ముఠా అయితే అయ్యుండచ్ఛేమో నాకు తెలియదు గాని, నా విషయంలో వాళ్లకి ఏ విధమైన సంబంధమూ లేదు..మీరన్న దానికి  పాయింట్లు గా నా వివరణ ఇస్తాను 
 
1.సురేష్ బాబు కొడుకు అభిరాం మీద ఇంకా ప్రొసీడ్ అవ్వకపోతే నాలుగో ఐదో కోట్లు  ఇప్పిచించటానికి ట్రై చేస్తానని శ్రీరెడ్డి కి చెప్పాను  కానీ మిమ్మల్ని తిట్టానికి కాదు..ఇది నేను రిలీజ్  చేసిన వీడియోలోచాలా క్లియర్ గా వుంది 
 
2.ఈ విషయం నేను ప్రస్తావించిన సందర్భం, అంత డబ్బు ఆఫర్ ఇచ్చినా వద్దన్న ఆ అమ్మాయి  క్యారెక్టర్ గురించి తెలపటానికి 
 
3.పెద్దవాళ్ళని అన్నప్పుడే చిన్నవాళ్లు వెలుగులోకి వస్తారనేది అనాదిగా తెలిసిన  సత్యం ..మహేష్  కత్తి example ఇఛ్చి తనకి సలహా ఇచ్చింది నేను ..ఇక్కడ ముఖ్యమైన విషయం ఇది వేరెవరో  ఇన్వెస్టిగేషన్ చేసి బయటకి తియ్యలేదు ఎవరూ అడగకుండా నాకు నేనే నా వీడియో ద్వారా  ఒప్పుకుని క్షమాపణ కూడా చెప్పాను.   
4.ఇక పోతే మీ అమ్మగారిని తిట్టటమన్నది  కరక్ట్ కాదు..ఆ పదానికి అర్ధం అమ్మ గురించి కూడా అలా  ఆలోచించే ఒక  మగాడిని వర్ణించడం..అది చాలా విరివిగా సరదాగా ఫ్రెండ్స్ మధ్యలో కూడా  వాడే  పదం... అమ్మని తిట్టేది సినిమాలలో కూడా చాలా విరివిగా వాడే  ల.... కొడుకు అనే  పదం 
 
5.మీకదే మీరెప్పుడూ విననంత ఘోరమైన తిట్టు అనిపిస్తే సోషల్ మీడియాలో మీ ఫాన్స్ వాడే  తిట్లు వింటే మీరు మూర్ఛచిపడిపోతారు.  
 
6.ఒకవేళ నిజంగా నేను, మీరన్న మిగతా ఆ కూటమి కలిసి ఆ అమ్మాయికి  5 కోట్లు  ఇఛ్చి   తిట్టించమనుకుందాం  .. కేవలం క్రెడిబిలిటీ లేని ఒక మామూలు అమ్మాయి మిమ్మల్ని ఆ పదం  వాడి తిడితే దాని మూలాన ఎవరికి ఏం లాభం వస్తుంది..మీ అంత సూపర్ స్టార్ లీడర్ ని రోడ్డు  మీద ఒక తిట్టు  తిడితే ఆ తిట్టులో వున్న అర్ధం నిజమనుకుంటారా? ,మీ  క్రెడిబిలిటీ  తగ్గిపోతుందా ? మీ కొచ్చే ఓట్లు  తగ్గిపోతాయా? 
 
7.ఈ విషయంలో మీరు వూహించుకుంటున్న పేర్లగల వారెవరూ లేరు..ఇది కేవలం నా ఒక్కడి  తప్పే  అని ఇంకొకసారి చెప్పి 20వ సారి మళ్ళీ  క్షమాపణ చెప్పుకుంటున్నాను 
 
PK: ఈ రోజు నుంచి నేను ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడి ముందుకు వెళ్తున్నాను, ఒక వేళ నేను ఈ పోరాటంలో చనిపోతే..మీరు గుర్తుంచుకోవాల్సింది "నేను ఎంతోకొంత నిస్సహాయులకు అండగా..అధికారం అనేది అండదండలు ఉన్నవారికే పని చేసే ఈ దోపిడీ వ్యవస్థపై ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన విధానాలు లోబడే పోరాటం చేస్తూ చనిపోయాడని అనుకుంటే చాలు." 
 
RGV: కళ్యాణ్ గారు, హీరో  అయినా మీరు మీ శత్రువులని చంపాలి కానీ మీ చావు గురించి మాట్లాడటం  మీకు తగదు ..మీరిలా మాట్లాడటం మీ ఫ్యాన్ గా నాకు బాధ కలిగిస్తోంది. 
 
రేపు  ఒక రాష్ట్రానికి నాయకుడిగా పోటీ  చేయబోయే మీరు..ఇలా మీ చావు గురించి మాట్లాడటం మీకు కానీ  మీరు వచ్చి ఏదో చేస్తారన్న ఆశ నమ్మకాలను పెట్టుకున్న కోట్లమంది మీ అభిమానులకు కానీ మంచిది కాదు అని నా ఉదేశ్యం. పవన్ కళ్యాణ్ గారు వేసిన కొన్ని ఇంగ్లీష్  ట్వీట్లు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.